E-Paper
Advertisement

Suriya: పెళ్లిలో సడన్ ఎంట్రీ ఇచ్చిన హీరో సూర్య.. వధువు వెంటనే ఏం చేసిందంటే?

Suriya: పెళ్లిలో సడన్ ఎంట్రీ ఇచ్చిన హీరో సూర్య.. వధువు వెంటనే ఏం చేసిందంటే?
Advertisement

Suriya: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరో, హీరోయిన్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తమ అభిమాన నటీనటులతో కలిసి కనీసం ఒక ఫోటో అయినా తీసుకోవాలని వారిని నేరుగా కలవాలనే ఆత్రుత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక కొంతమంది సెలబ్రిటీలు ఏకంగా తమ పెళ్లికి రావాలి అంటూ తమ ఇష్టమైన హీరో, హీరోయిన్లకు ఆహ్వానం అందజేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది సెలబ్రిటీలు అభిమానులకు ఊహించని విధంగా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. తాజాగా నటుడు సూర్య(Suriya) సైతం తన అభిమానికి ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చారనే చెప్పాలి.

అభిమాని పెళ్లికి వెళ్లిన సూర్య..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్య అభిమానుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఈయన ఇదివరకే ఎంతోమంది అభిమానుల పెళ్ళికి వెళ్లి వారిని సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మహిళ అభిమాని పెళ్లిలో సందడి చేశారు. అరవింద్ అనే అబ్బాయి కాజల్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక తనకు కాబోయే భార్య కాజల్ కు సూర్య అంటే విపరీతమైన అభిమానం ఉన్న నేపథ్యంలో అరవింద్ తన కాబోయే భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని నేరుగా సూర్యకు తెలియచేసి ఎలాగైనా తన పెళ్లికి రావాలి అంటూ రిక్వెస్ట్ చేశారు.

పెళ్లికూతురుకి సర్ప్రైజ్ ఇచ్చిన సూర్య..

Advertisement

అరవింద్ హీరో సూర్యను రిక్వెస్ట్ చేయటంతో సూర్య ఊహించని విధంగా ఈ పెళ్లిలో హాజరై సందడి చేశారు. అయితే ఈ విషయాన్ని అరవింద్ చివరి నిమిషం వరకు పెళ్లికూతురికి చెప్పకుండా దాచి ఉంచారు. సూర్య కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా పెళ్లి కుమార్తె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సూర్య మంచితనంపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా అభిమాని కోరిక మేరకు పెళ్ళికి రావడం అంటే నిజంగా గొప్ప విషయం అని, సాధారణంగా స్టార్ హీరోలు ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటారు కానీ సూర్య మాత్రం తమ అభిమాని సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని పెళ్లికి రావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

?igsh=NHk1amR1bHBxbGlm

Advertisement

ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సూర్య వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన నటించిన కరుప్పు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య నటించిన సినిమా కూడా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు సూర్య తన 47వ సినిమాని మలయాళం స్టార్ డైరెక్టర్ జిత్తు మాధవన్ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది . ఈ సినిమాలో సూర్య మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్ గా సందడి చేయనున్నారు.

Also Read; Pawan Kalyan: న్యూ ఇయర్ స్పెషల్ .. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన పవన్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×