E-Paper
Advertisement

Actor Tarun: ఇద్దరి ప్రాణాలు కాపాడిన హీరో తరుణ్..ఆ‌ రోజు రాత్రి ఏం జరిగిందంటే..!

Actor Tarun: ఇద్దరి ప్రాణాలు కాపాడిన హీరో తరుణ్..ఆ‌ రోజు రాత్రి ఏం జరిగిందంటే..!
Advertisement

Actor Tarun: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో తరుణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందిన తరుణ్, తరువాత హీరోగా కూడా అనేక చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా అతని మొదటి సినిమా..నువ్వే కావాలి సినిమా.. ఆయనకు భారీ విజయంతో పాటు యువతలో మంచి అభిమానాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎన్నో స్టోరీలు తీసి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో ఈ మధ్య మాత్రం సినిమాల్లో కనిపించడం లేదు. అయితే తాజాగా ఆయన గురించి ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆరోజు ఏం జరిగిందంటే..!

కొన్ని రోజుల క్రితం రాత్రి సమయంలో జరిగిన ఒక ప్రమాదంలో తరుణ్ ఇద్దరి ప్రాణాలు కాపాడినట్లు సమాచారం. ఆ రాత్రి సుమారు.. అర్ధరాత్రి సమయంలో తరుణ్ తన ఇంటి బయట కూర్చొని మొబైల్‌లో ఒక సినిమా చూస్తూ ఉన్నాడంట. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో ఏమైందో తెలుసుకోవడానికి వెంటనే బయటకు వచ్చాడు.

Advertisement

బయటకు వచ్చి రోడ్డువైపు చూసిన తరుణ్‌కు ఒక కారు అదుపు తప్పి బోల్తా పడినట్లు కనిపించింది. వెంటనే అక్కడికి పరుగెత్తి వెళ్లి కారు దగ్గర పరిస్థితిని పరిశీలించాడు. ఆ కారులో ఒక తండ్రి.. చిన్నారి కూతురు తీవ్రంగా గాయపడి చిక్కుకుని ఉన్నారంట. ప్రమాదం తీవ్రంగా ఉండడంతో వారు బయటకు రావడం కూడా కష్టంగా మారిందంట.

ఈ పరిస్థితిని చూసిన తరుణ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. కొద్దిసేపటికి తండ్రి-కూతురిని జాగ్రత్తగా బయటకు తీసి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు చికిత్స అందించడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

Advertisement

ఈ సంఘటన బయటకు రావడంతో తరుణ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా మనం సినిమాల్లో హీరోలు ప్రాణాలు కాపాడే సన్నివేశాలు చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో కూడా అదే విధంగా స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడటం అందరినీ ఆకట్టుకుంది.

చాలా మంది నెటిజన్లు తరుణ్‌ను నిజమైన హీరో అని అభినందిస్తున్నారు. సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా మంచి మనసుతో ముందుకు వచ్చి సహాయం చేసిన తరుణ్ చర్య ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: Rana Daggubati: 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ ఇలా లేదు..నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభంలో రానా దగ్గుబాటి

Related News

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

Big Stories

Advertisement
×