E-Paper
Advertisement

Divyabharathi : కాలేజీ లవ్ స్టోరీ.. హీరోయిన్ అయ్యాక ఓపెన్.. ఆమె వల్లే బ్రేకప్..?

Divyabharathi : కాలేజీ లవ్ స్టోరీ.. హీరోయిన్ అయ్యాక ఓపెన్.. ఆమె వల్లే బ్రేకప్..?

Divyabharathi : సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్లకు ఎప్పుడు అదృష్టం వరిస్తుందో చెప్పడం కష్టమే.. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అవకాశాలు వస్తూ ఉంటాయి. కొందరికి ఏమో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్ వచ్చేస్తుంది. అలాగే మరికొందరికి మాత్రం ఎన్ని సినిమాలు చేసినా కూడా సినిమాలు హిట్ అవుతాయి తప్ప పేరు మాత్రం రావడం లేదు. ఇండస్ట్రీ లోకి స్టార్ హీరోల సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లకు ఉన్న క్రేజే వేరు. అలాంటి ముద్దుగుమ్మలో హీరోయిన్ దివ్యభారతి ఒకరు.. బ్యాచిలర్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది దివ్యభారతి. మొదటి తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయి నటించింది.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.. అందులో భాగంగా తన కాలేజీ లవ్ స్టోరీ గురించి పంచుకుంది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ దివ్యభారతి ఎవరిని ప్రేమించింది? ఆ తర్వాత ఎందుకు బ్రేకప్ అయ్యింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాలేజీలోనే ప్రేమ కానీ..

ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే.. కానీ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అంతేకాదు ఆ మధ్య వార్తల్లో కూడా నిలిచింది.. ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ లో పెట్టుకుంటుంది. జబర్దస్త్ కమెడీయన్, హీరో సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన గోట్ సినిమాలో నటించింది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈమె యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలో తన లవ్ స్టోరీ గురించి బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. కాలేజీలోని ఒక ప్రొఫెసర్ ని గాఢంగా ప్రేమించినట్లు బయట పెట్టింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. కానీ ఆయన ప్రొఫెసర్ అని తర్వాత తెలిసింది.. అతను వేరే బ్రాంచ్ ప్రొఫెసర్. ఒకరోజు నేను అతన్ని చూస్తుంటే అతను కూడా నన్ను చూసాడు. ఆ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి మా సర్ నీ నెంబర్ అడిగారు ఇచ్చాను అని చెపింది. అయితే ఆ తర్వాత నేను ఎందుకు ఇచ్చావని కోప్పడ్డాను.. ఒకరోజు సడన్గా కాల్ చేశారు. ఆ తర్వాత రెగ్యులర్ గా మాట్లాడుకొని ఒకర్నొకరు ఇష్టపడ్డాం. ఎవర్ని పట్టించుకోని సర్ నాతో ఉన్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాలేజ్ అయ్యాక బ్రేక్ అయింది.. ఆ తర్వాత నా మొదటి సినిమా రిలీజ్ అయ్యాక కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారు.. ఇప్పటికీ ఆయన అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతారు అని ఆమె అన్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో దివ్యభారతి ఫస్ట్ క్రష్ ప్రొఫెసర్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

Also Read :నిఖిల్ ‘ స్వయంభు’ మళ్లీ వెనక్కి..ఆ ఒక్కటే కారణమా..?

తమిళ హీరోతో ప్రేమాయణం.. 

తమిళ హీరో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ తో ఈ అమ్మడు కొన్ని సినిమాలు చేసింది. ఆ సినిమాలు మంచి టాక్ ని అందుకున్నాయి. అయితే వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ వార్తలకి ఒక్క మాటతో చెక్ పెట్టేసింది హీరోయిన్.. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ గోట్ లో నటించింది. మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.. ఇది కనుక హిట్ అయితే తెలుగులో అవకాశాలు క్యూ కట్టే అవకాశం ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ కుర్ర కారు మతిపోగొడుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు లైనప్ లో పెట్టుకుంటూ బిజీగా ఉంది..

Related News

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

Big Stories

×