E-Paper
Advertisement

Best Mileage Car for 2026: ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. చౌకైన ఆటో మేటిక్ కారు ఇదే!

Best Mileage Car for 2026: ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. చౌకైన ఆటో మేటిక్ కారు ఇదే!
Advertisement

ఈ రోజుల్లో మధ్యతరగతి ప్రజలకు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఉండే కార్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వారిలో ఎక్కువ మంది తక్కువ ధర లభించడంతో పాటు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో తక్కువ ధరకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు ఏది?  అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బెస్ట్ మైలేజ్ ఇచ్చే చీప్ కారు  

తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బెస్ట్ కారు టాటా టియాగో CNGగా చెప్పుకోవచ్చు. ఇది అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, మంచి ఫ్యుయెల్ ఎఫిషియెన్సీ కలిగి ఉన్న ఆటోమేటిక్ CNG కారు. దేశంలోని మధ్య తరగతి కొనుగోలుదారులకు బడ్జెట్ ఫ్రెండ్లీ కారుగా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే బడ్జెట్ ధరలో లభించే సురక్షితమైన 5-సీటర్ హ్యాచ్‌ బ్యాక్. ఇది 26.49 km సర్టిఫైడ్ మైలేజీని ఇస్తుంది. 1.2 లీటర్ ఇంజన్‌ తో, ఇది మాన్యువల్,  ఆటోమేటిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

టాటా టియాగో CNG ధర ఎంత అంటే?

Advertisement

ఈ కారు ధర రూ. 5.49 లక్షల నుంచి ప్రారంభమై రూ. 8.90 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఇది ఆటోమేటిక్ CNGని అందించే మొదటి కార్లలో ఒకటి.  ఈ కారు ఇంజన్, పవర్ గురించి మాట్లాడుకుంటే 1199 cc, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్, CNG మోడ్‌ లో 74.41 bhp పవర్, 96.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.  5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.

టాటా టియాగో CNG ఫీచర్లు

ఈ కారు మంచి ఫీచర్లను కలిగి ఉంటుంది. 7 అంగుళాల హర్మన్ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.  హర్మాన్ ఆడియో సిస్టమ్,     LED DRLలు, ప్రీమియం అనుభూతి కోసం 15 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ను కలిగి ఉంది.

Advertisement

Read Also: ఆటో9 అవార్డ్స్ 2026.. ఈవీ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ గా సత్తా చాటిన టీవీఎస్ ఆర్బిటర్!

టాటా టియాగో CNG కలర్ ఆప్షన్స్

ఈ కారు పలు రంగుల్లో అందుబాటులో ఉంది. ఓషన్ బ్లూ, ప్రిస్టీన్ వైట్, టోర్నడో బ్లూ, సూపర్నోవా కాపర్, అరిజోనా బ్లూ, డేటోనా గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారు 4 స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్‌ తో చాలా సురక్షితంగా ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు,టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. టియాగో CNG పెట్రోల్ కంటే సుమారు రూ. 90,000 ఎక్కువ ధరతో వస్తుంది. కానీ, మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఒకవేళ మీకు మంచి మైలేజ్, మంచి సేఫ్టీతో పాటు సరసమైన, నమ్మకమైన ఆటోమేటిక్ అవసరమైతే వెంటనే టియాగో CNG వెర్షన్ ను కొనుగోలు చేయడం బెస్ట్.

Read Also:  ఇది ప్రపంచంలోనే కాస్లీయెస్ట్ ఎలక్ట్రిక్ కారు, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×