E-Paper
Advertisement

పవన్‌ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ కామెంట్స్.. నటి హేమ స్ట్రాంగ్ కౌంటర్..

పవన్‌ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ కామెంట్స్.. నటి హేమ స్ట్రాంగ్ కౌంటర్..
Advertisement

Actress Hema : టాలీవుడ్ యాక్టర్స్ హేమ ప్రస్తుతం వార్తల్లో హైలెట్గా నిలిచింది. నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై హేమ కౌంటర్ ఇచ్చారు. ఒక వీడియోని రిలీజ్ చేస్తుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో హేమ మరోసారి వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై అటు పవన్ ఫ్యాన్స్ తో పాటుగా ఇండస్ట్రీలోని పలువురు అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ కి నటి హేమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రకాష్ రాజ్ కి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్లు ఇస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ హేమ ఏమందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ కామెంట్స్..

తెలంగాణలో కూడా జనసేన పార్టీని విస్తరించి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆ వ్యాఖ్యల పై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.. రండి దొర.. మీరొస్తానంటే మేమొద్దంటామా? కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్‌గా వస్తున్నారా? అది చెప్పి రండి అంటూ సెటైరికల్ పోస్ట్ చేశారు… ప్రకాష్ రాజ్ నేరుగా జనసేన నాయకులను ఉద్దేశించి అనకపోయినా.. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కామెంట్స్ చేసినట్లు భావిస్తున్నారు.ఈ ట్వీట్ పై ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ స్పందించి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చాడు.. ఇప్పుడు తాజాగా నటి హేమ స్పందించి ప్రకాష్ రాజ్ కి తనదైన స్టైల్ లో కౌంటర్లు ఇచ్చింది.

ప్రకాష్ రాజ్ కు హేమ స్ట్రాంగ్ కౌంటర్..

Advertisement

ప్రకాష్ రాజ్ ట్వీట్ పై నటి హేమ స్పందిస్తూ.. తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో తాను మాట్లాడుతూ.. హలో ప్రకాష్ రాజ్ గారు.. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూశా. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని ‘దొర’ అని సంబోధించడం వెనక మీ వెటకారం ఏంటో స్పష్టంగా అర్థం అవుతుంది. రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు.. రాజకీయంగా విమర్శించడం తప్పులేదు కానీ ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం తప్పు అని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మనసు ఏంటో, మనస్తత్వం ఏంటో కోట్లాదిమంది ప్రజలకు తెలుసు అని హేమా అన్నారు.. మీతో నేను చాలా సినిమాలు భార్యగా యాక్ట్ చేశాను. మీరు ఈరోజు షూటింగ్‌కి వస్తానని డేట్ ఇస్తారు. మేమందరం పొద్దున్నే మేకప్ వేసుకుని, రెడీ అయిపోయి కూర్చుంటాం. మీరు ఇంకా వస్తారు వస్తారు అని వెయిట్ చేసి చివరికి లంచ్ తర్వాత వస్తారు. లేదంటే ఒక్కొక్కసారి రారు. నాకు ఈ సినిమా చేయడం ఇష్టం లేక వేరే కంట్రీ కి పోయాను అని చెప్తారు. ఇలా చాలాసార్లు చేశారు.. నేను మిమ్మల్ని అడిగాను.. మీరెందుకు ఇలా చేస్తున్నారు?’ అంటే.. ‘నాకు మూడ్ లేదురా యాక్ట్ చేయడానికి, అందుకే నేను ఆ కంట్రీ వెళ్ళిపోయాను. ఇక మీరు నాకు ఒకటి చెప్పండి.. రాజకీయాల్లోకి మీరు సింగిల్‌గా వస్తారా? గుంపులతో వస్తారా? మీకు రాజకీయాలు చేసి ప్రజాసేవ చేసే మూడ్‌లో ఉన్నారా?.. మీరు రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అన్నది చెప్పండి సార్ అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హేమ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. మరి దీనిపై నటుడు ప్రకాష్ రాజు ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తిగా మారింది..

?igsh=dXZ0YWxvYjNheXM0

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: బామ్మను కాపాడిన బాలు.. కన్నీళ్లు తెప్పించే సీన్.. ప్రభావతికి కొత్త టెన్షన్..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×