E-Paper
Advertisement

ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్‌ మృతి, ఏం జరిగింది? ఎవరున్నారు?

ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్‌ మృతి, ఏం జరిగింది? ఎవరున్నారు?
Advertisement

Delhi Crime: ఢిల్లీ యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దేవోస్మిత పాల్‌ శివాజీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త బెంగళూరులో ఉంటుండగా, ఆమె ఢిల్లీలో ఒంటరిగా ఉంటున్నారు. ఫ్లాట్‌ బయట తాళం వేసి ఉంది. ఫోన్‌ చేసినప్పటికీ స్పందించకపోవడంతో మృతురాలి సోదరి అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది.

ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్‌ అనుమానాస్పద మృతి

Advertisement

పోలీసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలోని శివాజీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు దేవోస్మిత పాల్‌. అయితే ఆమె భర్త బెంగళూరులో ఉంటున్నారు. ఆమె తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. గురువారం ఉదయం ఫ్లాట్‌‌కు బయట తాళం వేసి ఉంది.

ఏదో పని నిమిత్తం పాల్‌ సోదరి ఫోన్‌ చేసింది. తన చెల్లెలు నుంచి ఎలాంటి స్పందన లేదు.దీంతో అనుమానం వచ్చి సోదరి దేవరి ఫ్లాట్‌ తాళం పగలకొట్టి లోపలికి వెళ్లి చూసింది. అప్పటికే తన చెల్లెలు విగతజీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు తలపై బలంగా దాడి చేయడంతో ఆమె మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

Advertisement

ఆమెని చంపిందెవరు? ఇంట్లో బంగారం, నగదు మాటేంటి?

ఆ ప్లాట్‌‌లో ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లోని బంగారం, నగదు అలాగే ఉన్నాయని, దోపిడీ జరిగిన ఆనవాళ్లు లేవంటున్నారు. హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన కీలకమైన రహస్యాలలో ఒకటి.

బాధితురాలి మృతదేహం లోపల ఉండగా, అపార్ట్‌మెంట్‌కు బయటి నుండి ఎలా తాళం వేసిందెవరు? నివాసంలోకి ఎవరైనా బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్ల ఆధారాల కోసం పరిశీలన చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలాన్ని ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. ప్రొఫెసర్ మ‌రణానికి దారి తీసినదానికి సంబంధించి  సాధ్యమయిన ప్రతి ఆధారాన్ని పరిశీలన చేస్తున్నారు.

ALSO READ: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×