E-Paper
Advertisement

Mrunal Thakur : హద్దులు దాటితేనే ఇక్కడ అవకాశాలు .. మృణాల్ ఠాకుర్‌ షాకింగ్ కామెంట్స్

Mrunal Thakur : హద్దులు దాటితేనే ఇక్కడ అవకాశాలు .. మృణాల్ ఠాకుర్‌ షాకింగ్ కామెంట్స్
Advertisement

Mrunal Thakur : హీరోయిన్ మృణాల్ ఠాకుర్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది ఈ బ్యూటీ. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కట్టిపడేసింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది.

మృణాల్ ఠాకూర్.. తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి ‘హాయ్ నాన్న’ అనే సినిమా చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆ తర్వాత రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ‘ఫ్యామిలి స్టార్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇదే సమయంలో ‘సూపర్ 30’, ‘జెర్సీ’ వంటి హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.ఇక తెలుగుతో పాటు, బాలీవుడ్ సినిమాల్లో కూడా వరుస ఆఫర్లు కొట్టేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. మృణాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన సినిమాలపై ఆసక్తికరంగా స్పందించారు.

Advertisement

నేను ఒక భాషకు మాత్రమే పరిమితం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. హద్దులు దాటితేనే గొప్ప అవకాశాలు వస్తాయి. భాష అనేది కేవలం భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం మాత్రమే. మంచి కథ ఉంటే ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి నటించడానికి నేను సిద్ధమని స్పష్టం చేసి తన ఆశయాలను బయటపెట్టింది. ఒక నటిగా అన్ని రకాల సంస్కృతులను, భాషలను అనుభవించాలని నా కోరిక. మంచి కథ ఉంటే.. ప్రపచంలో ఎక్కడికైనా ఏ భాషలోనైనా వెళ్లి నటిస్తానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

ఇక టాలీవుడ్‌పై స్పందిస్తూ..తెలుగు సినిమాల్లో నటించడం వల్ల నాకు ఎంతో గౌరవం దక్కింది. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరాభిమానాలు చూస్తుంటే తనకు పుట్టింటికి వచ్చినంత గౌరవం కలుగుతోందని ఎమోషనల్ అయ్యింది. ఇక మృణాల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ భామ హిందీలో రెండు ప్రాజెక్ట్స్ చేస్తుండగా.. తెలుగులో ‘డెకాయిట్’ చేస్తుంది. ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా.. షానీల్ డియో దర్శకత్వంలో రాబోతుంది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాది కానుకగా.. మార్చి 19న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంతో మృణాల్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మ్యాజిక్ రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×