E-Paper
Advertisement

Tigers Spotted: ఆదిలాబాద్ జిల్లాలో మూడు పులుల సంచారం.. ఆ గ్రామాల ప్రజలు జాగ్రత్త..

Tigers Spotted: ఆదిలాబాద్ జిల్లాలో మూడు పులుల సంచారం.. ఆ గ్రామాల ప్రజలు జాగ్రత్త..
Advertisement

Tigers Spotted: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పులుల సంచారం పెరగడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ నెల పులుల పునరుత్పత్తి (మేటింగ్) సమయం కావడంతో.. అవి తమ ఆవాసాల నుంచి బయటకు వచ్చి విస్తృతంగా సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో కనీసం నాలుగు పులులు తిరుగుతున్నట్లు అధికారికంగా గుర్తించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, అంధేరి టైగర్ రిజర్వ్‌ల నుంచి పులులు నిరంతరం రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ కారిడార్ పులుల రాకకు ప్రధాన మార్గంగా మారింది. ప్రస్తుతం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే మూడు పులులు సంచరిస్తుండటం గమనార్హం. వీటిలో ఒక ఆడ పులి, రెండు మగ పులులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. కాగజ్‌నగర్ కారిడార్‌లో రెండు పులులు ఉండగా.. తిర్యాని అటవీ ప్రాంతంలో మరొక పులి సంచరిస్తోంది. తిర్యానిలో ఉన్న పులి ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలోని కాసిపేట అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు పాదముద్రల ద్వారా గుర్తించారు.

Advertisement

అటవీ ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించడం వల్ల పులులకు అనువైన వాతావరణం ఏర్పడిందని.. అందుకే వాటి సంచారం పెరిగిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. పులుల కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి అటవీశాఖ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు.. అడవుల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులుల కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ గ్రామస్థులను హెచ్చరిస్తున్నారు.

పులుల సంచారం నేపథ్యంలో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ కోరింది. ముఖ్యంగా.. వ్యవసాయ కూలీలు, రైతులు సాయంత్రం 4 గంటల లోపే పనులు ముగించుకుని సురక్షితంగా ఇళ్లకు చేరాలన్నారు. పొలాల్లోకి లేదా అడవుల్లోకి వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకూడదు గుంపులుగా వెళ్లాలని, పులి పాదముద్రలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించాలన్నారు. పులులకు లేదా వాటి పిల్లలకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. ఒకవేళ వన్యప్రాణులను హింసిస్తే చట్టరీత్యా కఠిన శిక్షలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Advertisement

వన్యప్రాణుల రక్షణతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ఇప్పటికే పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అడవికి సమీపంలో ఉన్న ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ALSO READ: Anantapur District Gunfire: అనంతపురంలో కాల్పుల కలకలం.. CIపై కత్తితో దాడి

Related News

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

Big Stories

Advertisement
×