E-Paper
Advertisement

Nivetha Pethuraj: ఆగిపోయిన టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఆ ఫోటోలన్నీ డిలీట్?

Nivetha Pethuraj: ఆగిపోయిన టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఆ ఫోటోలన్నీ డిలీట్?
Advertisement

Nivetha Pethuraj టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు 2025వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అలాగే మరి కొంతమంది నిశ్చితార్థం చేసుకుని 2026వ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న నటి రష్మిక మందన్న కూడా 2026 లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈమెతో పాటు మరో నటి నివేథా పేతురాజ్(Nivetha Pethuraj) కూడా గత కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమె పెళ్లి ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

నిశ్చితార్థపు ఫోటోలు డిలీట్..

ఈ వార్తలకు అనుగుణంగానే నీవేదా పేతురాజ్ సోషల్ మీడియా వేదికగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలు (Engagment Photos)అన్నింటిని డిలీట్ చేశారు అలాగే ఈమె పెళ్లి చేసుకోబోయే రాజ్ హిత్ ఇబ్రాన్ (rajhith ibran)ను కూడా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి నివేదా పేతురాజ్ నిజంగానే తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారా? లేదా? అనే విషయాలు తెలియాలి అంటే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల ప్రముఖ క్రికెటర్ స్మృతి మందాన వివాహం కూడా ఎంగేజ్మెంట్ తర్వాత రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం మర్చిపోకముందే నటి నివేదా కూడ తన వివాహాన్ని రద్దు చేసుకున్నారని వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త..

Advertisement

నివేదా పేతురాజ్ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను ఆగస్టు 2025 చివరలో పరిచయం చేసింది అలాగే అక్టోబర్లో వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక వీరి వివాహం 2026 జనవరిలో జరగబోతుందని వార్తలు వచ్చాయి. మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నివేద ఉన్నఫలంగా తన వివాహాన్ని రద్దు చేసుకోవడంతో ఈ విషయంపై ఎన్నో రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల పట్ల ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

సోషల్ మీడియాలో అన్ ఫాలో..

Advertisement

నివేదా పేతురాజ్ కెరియర్ విషయానికి వస్తే ఈమె తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో నటిస్తున్నటిగా సక్సెస్ అందుకున్నారు. నివేదా హీరోయిన్ గా నటించిన మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచే వారెవరురా వంటి సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న నివేదా పేతురాజ్ ప్రియుడితో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అభిమానులు భావించారు. కానీ పెళ్లి రద్దయిందని, సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారని వార్తలు బయటకు రావడంతో అందరూ షాక్ అవ్వుతున్నారు.

Also Read: Ozempic Drug :ఓజెంపిక్ కు బానిసలవుతున్న బాలీవుడ్.. ఓజెంపిక్ ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×