Pooja Hegde: సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే క్షణాలలో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు జంటగా కలసి ఒకటి, రెండు సినిమాల్లో చేసినా లేదా ఒకటికి రెండుసార్లు మీడియా కంట కనిపించినా సరే వారి మధ్య ఏదో ఉందనే రూమర్లు క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఆ రూమర్లు నిజమైతే.. మరొకసారి అవి కేవలం వార్తలు గానే నిలిచిపోతాయి అనడంలో సందేహం లేదు. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఒక జంట కలిసి నటించకపోయినా.. ఇప్పుడు వారిద్దరూ ప్రేమలో పడ్డారనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ బుట్ట బొమ్మ అలియాస్ పూజా హెగ్డే.
అందాల తారగా, అభినయ సుందరిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రేమలో పడిందనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. నిజానికి గతంలో ఈమె డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చినా.. అవి కేవలం రూమర్స్ గానే మిగిలాయి. కానీ ఇప్పుడు ముంబై మీడియా ఈ వార్తలను కన్ఫామ్ చేస్తూ కథనాలు ప్రచురిస్తోంది. మరి బుట్ట బొమ్మను ముగ్గులోకి దింపిన ఆ వ్యక్తి ఎవరు అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పూజా హెగ్డే ప్రేమలో పడిందనే వార్తలు రావడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో కిసీకా బాయ్ కిసీకా జాన్ సినిమా చేస్తున్న సమయంలోనే సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో ఆమె వాటిని ఖండించింది. ఇప్పుడు మరొకసారి లవ్ లైఫ్, డేటింగ్ గురించి వార్తలు వినిపించడం గమనార్హం. ప్రముఖ బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో ఈమె ప్రేమలో పడిందనే వార్త వినిపిస్తోంది.. దీనికి కారణం గత ఏడాది పూజా హెగ్డే బర్తడే సమయంలో రోహన్ మెహ్రా చేసిన ఇంస్టా పోస్ట్ వైరల్ అవ్వడమే.. మరి అప్పుడు పోస్ట్ పెడితే ఇప్పుడు వైరల్ అవ్వడం ఏంటి అనే ప్రశ్న అందరిలో మొదలవచ్చు.. అసలు విషయంలోకి వెళ్తే.. వీరిద్దరూ ఈమధ్య ఎక్కువగా తమ రిలేషన్ పట్ల సీరియస్ గా ఉన్నారని.. కలిసి షికారులకు వెళ్లడం, రెస్టారెంట్లకు వెళ్లడం వంటివి చేస్తూ మీడియా కంట పడుతున్నారు. అందుకే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే పూజ హెగ్డే , రోహన్ మెహ్రా కలిసి ఒక్క సినిమా చేయలేదు. కానీ కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది . పైగా ఇద్దరు ముంబైలోనే ఉంటున్నారు. ఇక కలసి జంటగా తిరుగుతూ బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కళ్ళల్లో కూడా పడినట్లు సమాచారం..మొత్తనికైతే వీరిద్దరూ త్వరలోనే తమ రిలేషన్ ను అనౌన్స్ చేస్తారని అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు . మరి ఎప్పుడు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి. ఇక పూజ హెగ్డే విషయానికొస్తే ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇక రోహన్ మెహ్రా విషయానికి వస్తే బజార్, ఐపీసీ420, కాలా వంటి వెబ్ సిరీస్లు చేశారు.