E-Paper
Advertisement

కార్లకు కొత్త తెలివి.. నోటి మాటతో చెప్పిన పని చేసేస్తాయ్!

కార్లకు కొత్త తెలివి.. నోటి మాటతో చెప్పిన పని చేసేస్తాయ్!
Advertisement

Google Gemini in GM Cars: ప్రముఖ ఆటోమోబైల్ సంస్థ జనరల్ మోటార్స్ (GM) కీలక నిర్ణయం తీసుకుంది. తమ వాహన వినియోగదారులకు మరింత అధునాతన డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించేందుకు సరికొత్త అప్‌ డేట్‌ ను ప్రకటించింది. ఈ అప్‌ డేట్ ద్వారా గూగుల్ జెమిని అనే AI అసిస్టెంట్‌ ను త్వరలో అమెరికాలోని సుమారు 40 లక్షల జీఎం వాహనాలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా డ్రైవర్లు కారును నడుపుతూనే బోలెడు ఇతర పనులను చేసుకునే అవకాశం ఉంటుంది. రూట్ వివరాలు అడగడం, టెక్స్ట్ మెసేజ్‌లు పంపించడం,  ప్రయాణానికి అనుగుణంగా ఉండేలా పాటలను కనుగొనడం లాంటి పనులను వాయిస్ కమాండ్ ద్వారా చేసుకునే అవకాశం ఉంది.

ఈ అప్ డేట్ ఏ కార్లలో ఉంటుందంటే?

ఈ అప్‌ డేట్ 2022, ఆ తర్వాత విడుదలైన క్యాడిలాక్, చేవ్రొలెట్, బ్యూక్, GMC వాహనాల్లో అందుబాటులోకి రానుంది.  ముఖ్యంగా, గూగుల్ ఇన్‌ బిల్ట్ సిస్టమ్ ఉన్న వాహనాల్లో ఈ ఫీచర్ పని చేస్తుంది. GM ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఈ జెమిని అసిస్టెంట్ యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్‌ డేట్‌ కోసం వినియోగదారులు ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న వాహనాల్లో గూగుల్ అసిస్టెంట్ యాప్‌ కు ప్లే స్టోర్ ద్వారా ఆటోమేటిక్‌గా ఈ అప్‌ డేట్ వస్తుంది. అయితే, ఈ ఫీచర్ ఉపయోగించాలంటే డ్రైవర్లకు ఆన్‌ స్టార్ వాయిస్ అసిస్టెన్స్ ప్లాన్ ఉండాలి.

Advertisement

ఇక 2025, ఆ తర్వాత విడుదలైన మోడళ్లకు ఈ అప్ డేట్  మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ వాహనాల్లో ఆన్‌ స్టార్ బేసిక్స్ ప్యాకేజీ భాగంగా ఈ సేవను ఎనిమిది సంవత్సరాల పాటు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా అందించనున్నారు. ఈ ప్యాకేజీ ద్వారా నావిగేషన్, వాయిస్ కమాండ్స్, రిమోట్ యాక్సెస్,  స్ట్రీమింగ్ యాప్స్ లాంటి సదుపాయాలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ AI అసిస్టెంట్ అమెరికన్ ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ, భవిష్యత్తులో మరిన్ని భాషలు,  దేశాలకు ఈ సదుపాయాన్ని విస్తరించే అవకాశం ఉందని కంపెనీ వెల్లడంచింది.

AI ఎలా పనిచేస్తుంది?

డీలర్లకు సంబంధించి, ఈ అప్‌ డేట్ ఒక సాధారణ సాఫ్ట్‌ వేర్ లా కనిపించినప్పటికీ, కస్టమర్ల నుంచి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా, మొబైల్ ఫోన్లలో జెమినిని ఉపయోగించిన వినియోగదారులు, అదే విధంగా కారులో కూడా పని చేస్తుందని భావించే అవకాశం ఉంది. అందుకే డీలర్‌ షిప్ స్థాయిలో సరైన శిక్షణ ఇవ్వడం మంచిదనే సూచనలు వస్తున్నాయి. ఈ AI ఎలా పని చేస్తుంది?, దాని పరిమితులు ఏంటి? అనే విషయాలను స్పష్టంగా వివరించాలంటున్నారు.

Advertisement

ఈ జెమిని అప్‌ డేట్ ద్వారా డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ మరింత స్మార్ట్‌ గా, సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. AI సాయంతో డ్రైవర్లు తమ రోజువారీ అవసరాలను సులభంగా చేసుకునే వెసులుబాటు కలగనుంది.

Read Also: సింగిల్ ఛార్జ్ తో 700 కి.మీ దూసుకెళ్లే బెంజ్.. ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×