NBK 112:గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరు సొంతం చేసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna )ఆరుపదుల వయసు దాటినా వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. పైగా మాస్ దర్శకులకు అవకాశం కల్పిస్తూ అభిమానులకు పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అభిమానులకు మరొకసారి గూస్ బంప్స్ తెప్పించే కలయిక తెరపైకి రానుంది. కొరటాల శివ ఎప్పుడైతే బాలకృష్ణతో సినిమా చేస్తున్నారనే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందో.. అప్పటినుంచి అభిమానుల ఆత్రుతకు ఆగడాలు లేవనే చెప్పాలి ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఎన్.బి.కే 112 అనే వర్కింగ్ టైటిల్ తో కొత్త ప్రాజెక్టుని ప్రారంభించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మే 1వ తేదీన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ఘనంగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఒకవైపు ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరొకవైపు కొరటాల శివ ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టారు బాలయ్య. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
అసలే మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కొరటాల శివ దేవరా సినిమా తర్వాత దేవర 2 సినిమా షూటింగ్లో బిజీ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బాలయ్యతో సినిమా చేయడానికి ఆయన సిద్ధం అయిపోయారు. ఇక తన సినిమాలలో బలమైన మెసేజ్ తో పాటు హీరో పాత్రను చాలా పవర్ఫుల్గా చూపించడంలో కొరటాల శివ దిట్ట. ఇక ఇప్పుడు బాలయ్య మార్క్ పవర్ఫుల్ యాక్షన్ కు కొరటాల మేకింగ్ శైలి తోడైతే థియేటర్లలో సంచలనం సృష్టించడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రముఖ సీనియర్ హీరోయిన్ ప్రియమణిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
also read:నీకూ ఫ్యాన్స్ ఉంటారా? వ్యక్తిగత దూషణలపై స్పందించిన అడివి శేష్!
ఒకప్పుడు అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె భామా కలాపం వంటి సిరీస్లలో అమాయకత్వమైన మోము తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మళ్లీ సీనియర్ హీరోలకు జోడి కడుతూ మరింత బిజీగా మారిపోయింది ప్రియమణి. అందులో భాగంగానే ఇప్పటికే ఈమె మెగాస్టార్ బాబీ కాంబినేషన్లో వస్తున్న మెగా 158 సినిమాలో ఎంపికయింది. ఇక ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాలతో పాటు మలయాళం మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ, సైలెంట్ రేడియో, జననాయగన్ వంటి చిత్రాలలో నటిస్తోంది.