E-Paper
Advertisement

నీకూ ఫ్యాన్స్ ఉంటారా? వ్యక్తిగత దూషణలపై స్పందించిన అడివి శేష్!

నీకూ ఫ్యాన్స్ ఉంటారా? వ్యక్తిగత దూషణలపై స్పందించిన అడివి శేష్!
Advertisement

Adivi shesh:రాయి శిల్పంగా మారాలి అంటే ఉలి దెబ్బలు తప్పవు. అందుకే ఒక నటుడు స్టార్ గా ఎదగాలి అంటే ఎన్నో అవమానాలు, హేళనలు, ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదలు ఇటీవల యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న సుహాస్ వరకు ఎంతోమంది ఎన్నో అవమానాలు పడ్డ వారే. అయితే ఇప్పుడు ఆ జాబితాలో తాను కూడా అతీతం కాదు అంటూ తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, అవమానాల గురించి చెప్పుకొచ్చారు అడివి శేష్ (Adivi shesh).. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న అడివి శేష్ ఈసారి డెకాయిట్ అనే రొమాంటిక్ క్రైమ్ డ్రామా మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అడివి శేష్ వస్తున్నారంటే కచ్చితంగా కొత్తదనం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకులలో బలంగా పాకిపోయింది.

నీకు కూడా అభిమానులు ఉంటారా అని హేళన చేశారు – అడివి శేష్

అలా ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో డికాయిట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తనకు ఎదురైన ట్రోలింగ్ అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. అడివి శేషు మాట్లాడుతూ..” గతంలో గూఢచారి 2 గురించి నేను ట్వీట్ చేస్తూ ఫ్యాన్స్ అనే పదాన్ని వాడినప్పుడు ఒక నెటిజన్ చేసిన కామెంట్ నన్ను ఆలోచింపజేసింది. అసలు నీకూ ఫాన్స్ ఉంటారా? అని వ్యంగంగా ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. నాకు చాలా బాధ కలిగించింది. నేను గూఢచారి ఫ్రాంచైజీని ఇష్టపడే ప్రేక్షకుల గురించి అలా మాట్లాడాను. కానీ దానిని వ్యక్తిగతంగా తీసుకొని వారు నన్ను విమర్శించారు. అయితే నేను తగ్గకుండా నా క్రెడిబిలిటీనే నా బలం అని సమాధానం ఇచ్చాను “‘అంటూ నాడు జరిగిన హేళనలు, అవమానాల గురించి గుర్తు చేసుకున్నారు అడివి శేష్. ఇక ఈ మాటలు విన్న అభిమానులు పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. అన్నీ ఓర్చుకుంటేనే ఉన్నత స్థానం లభిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

also read:నితిన్ కొత్త ప్రాజెక్ట్.. హీరోయిన్ గా యంగ్ బ్యూటీ.. ఈ కాంబో అయినా సక్సెస్ అవుతుందా?

అలా ఉండడమే నాకు ఇష్టం – అడివి శేష్

ఇక ఇదే ఇంటర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ..” నేను చాలా సింపుల్ గా ఉండాలని ఇష్టపడతాను. అందుకే నన్ను నేను స్వీయ ప్రచారం చేసుకోను. ముఖ్యంగా అలాంటి నాకు ఇలాంటి కామెంట్లు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో కూడా ఒక్కోసారి అర్థం కాదు. అయితే ఈ సంఘటన నన్ను మరింత బలంగా మారేలా చేసింది. ఏ సినిమాకైనా అసలైన పరీక్ష మండే టెస్ట్ అని ఇండస్ట్రీలో చెబుతారు కదా.. ఈ విషయంలో డెకాయిట్ సినిమా మంచి విజయం సాధించింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు అడివి శేష్ .ఒకవైపు థియేటర్లకు ఐపిఎల్ , ఓటీటీ, సోషల్ మీడియా వంటి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ కూడా ఈ డెకాయిట్ సినిమా రెండో వారం కూడా బలంగా థియేటర్లలో నిలబడడం విశేషం. ఇక ప్రస్తుతం అడివి శేష్ నాడు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×