E-Paper
Advertisement

Actress Samantha: భర్తను ఆటపట్టిస్తున్న సమంత … అన్ సీన్  ఫోటోలను షేర్ చేసిన నటి!

Actress Samantha: భర్తను ఆటపట్టిస్తున్న సమంత … అన్ సీన్  ఫోటోలను షేర్ చేసిన నటి!
Advertisement

Actress Samantha: సినీనటి సమంత ప్రస్తుతం కెరియర్ పరంగా, తన వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ ఏడాది ఈమె కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజులలో 2025వ సంవత్సరం ముగియబోతున్న నేపథ్యంలో ఈ సంవత్సరంలో తన బెస్ట్ మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో భాగంగా సమంత (Samantha)పెళ్లికి సంబంధించి అన్ సీన్ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో భాగంగా పెళ్లిలో సమంత రాజ్ ను ఆట పట్టిస్తూ ఉన్న ఫోటో అందరిని ఆకట్టుకుంది. అలాగే శుభం సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటు వీడియోల కూడా ఈమె షేర్ చేశారు.

2025 ఎంతో ప్రత్యేకం..

ఇలా ఈ ఏడాది ముగియబోతున్న నేపథ్యంలో ఎంతోమంది సెలబ్రిటీలు ఈ ఏడాదికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే సమంత సైతం  ఈ ఫోటోలను షేర్ చేస్తూ 2025వ సంవత్సరం తనకు ఎంతో ప్రత్యేకమని తెలియజేశారు. ఈ ఏడాదిలో తన జీవితంలో జరిగిన కొన్ని కీలక సంఘటనలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత 2017 వ సంవత్సరంలో నాగచైతన్యను పెళ్లి చేసుకుని 2021లో విడాకులు తీసుకొని విడిపోయారు. తిరిగి 2025వ సంవత్సరంలో ఈమె డైరెక్టర్ రాజ్ (Raj)ను రెండో వివాహం చేసుకున్నారు. దీంతో ఈ సంవత్సరం తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. అలాగే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి ఈ నిర్మాణ సంస్థలో శుభం అనే సినిమాకు నిర్మాతగా మారి మంచి సక్సెస్ అందుకున్నారు.

లింగ బైరవి ఆలయంలో వివాహం..

Advertisement

ఇలా 2025వ సంవత్సరం సమంతకు ఎంతో ప్రత్యేకమని ఈ సందర్భంగా వెల్లడించారు. డైరెక్టర్ రాజ్ తో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్న సమంత డిసెంబర్ ఒకటవ తేదీ ఈషా ఫౌండేషన్ లోని లింగ బైరవి ఆలయంలో కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇలా వ్యక్తిగతంగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన సమంత కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీ అవుతున్నారు. ఈమె ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థలోనే నందిని రెడ్డి డైరెక్షన్లో మా ఇంటి బంగారం అనే సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా సినిమాలతో పాటు సమంత వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు క్లాతింగ్ బిజినెస్, పర్ఫ్యూమ్  బిజినెస్ లను ప్రారంభించి వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత రి ఎంట్రీలో ఇలా బిజీ అవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×