E-Paper
Advertisement

Actress Namitha: రీ ఎంట్రీకి సిద్ధమైన ప్రభాస్ బ్యూటీ.. ఆ తప్పు అస్సలు చేయనంటూ!

Actress Namitha: రీ ఎంట్రీకి సిద్ధమైన ప్రభాస్ బ్యూటీ.. ఆ తప్పు అస్సలు చేయనంటూ!
Advertisement

Actress Namitha: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరోయిన్లు ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగలేరనే విషయం అందరికీ తెలిసిందే. హీరోలు 60 సంవత్సరాలు వచ్చినా హీరోలుగానే నటిస్తూ ఉంటారు కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకానొక సమయంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారందరూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తల్లి అక్క వదిన పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇప్పటికే లయ, జెనీలియా, మీరా జాస్మిన్ వంటి హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నమిత..

ఇలా ఈ హీరోయిన్లందరూ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. అయితే త్వరలోనే మరో ముద్దుగుమ్మ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన వరుస అవకాశాలను అందుకుంటూ ఓ వెలుగు వెలిగిన వారిలో నటి నమిత (Namitha) ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, వెంకటేష్, బాలకృష్ణ వంటి హీరోలతో కలిసి సినిమాలు చేశారు. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నమిత తిరిగి రీఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఈమె గుజరాతి అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని తెలుగింటి కోడలుగానే అడుగు పెట్టారు.

గ్లామర్ పాత్రలకు దూరంగా..

Advertisement

ఇలా పెళ్లి చేసుకున్న నమిత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు అయితే తన పిల్లలు కాస్త పెద్ద కావడంతో తిరిగి సినిమాలలోకి రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ .. రీ ఎంట్రీ విషయంలో తాను కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నానని గతంలో చేసిన తప్పులను అసలు చేయనని తెలిపారు. ఇకపై గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటానని నమిత వెల్లడించారు. ఒకానొక సమయంలో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ మొహమాటం కారణంగా సినిమా కథ నచ్చకపోయినా సినిమాలు చేశానని, ఇకపై కథ నచ్చకపోతే ఎలాంటి మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తానని తెలిపారు. కథ ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసమే తాను ఎదురుచూస్తున్నానని అలాంటి సినిమాలలో అవకాశం లభిస్తే ఖచ్చితంగా తాను రీఎంట్రీ ఇస్తాను అంటూ ఈ సందర్భంగా నమిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గుడి కట్టిన అభిమానులు ..

Advertisement

ప్రస్తుతం ఈమె రీ ఎంట్రీ కోసం కథలు వినే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక నమిత తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహ, పరమవీరచక్ర వంటి తదితర సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక తమిళంలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి అక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. తమిళ ప్రేక్షకులు నమితకు తమిళనాడులో గుడి కట్టారంటేనే ఈమెకు అప్పట్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో స్పష్టం అవుతుంది.

Also Read: Actress Samanth: భర్తను ఆటపట్టిస్తున్న సమంత … అన్ సీన్  ఫోటోలను షేర్ చేసిన నటి!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×