E-Paper
Advertisement

Shailaja Priya: 40 ఏళ్లు దాటినా తగ్గేదేలే.. ఇంకొంచెం డేంజరస్‌గా మారానంటున్న బుల్లితెర నటి..!

Shailaja Priya: 40 ఏళ్లు దాటినా తగ్గేదేలే.. ఇంకొంచెం డేంజరస్‌గా మారానంటున్న బుల్లితెర నటి..!
Advertisement

Shailaja Priya: తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి శైలజ ప్రియా ప్రస్తుతం సినిమాలు.. సీరియల్స్‌లో బిజీగా కొనసాగుతున్నారు. ఆమె తన నటనతో పాటు తన స్టైల్‌తో కూడా మంచి గుర్తింపు సంపాదించారు. 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆమె ఎనర్జీ, ఆత్మవిశ్వాసం తగ్గకుండా ముందుకు సాగుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన శైలజ ప్రియా చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి చూపించారు. చదువుకుంటున్న రోజుల్లోనే మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించి, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి, తన కృషితో మంచి అవకాశాలు దక్కించుకున్నారు.

Advertisement

తన కెరీర్‌లో ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఫ్రెండ్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా, మళ్లీ తిరిగి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మంచి విజయాలు సాధించారు.

టెలివిజన్ రంగంలో కూడా ఆమె మంచి పేరు సంపాదించారు. అనేక సీరియల్స్‌లో నటిస్తూ కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. ఆ షోలో ఆమె తన ధైర్యం, స్పష్టమైన మాటలతో అందరినీ ఆకట్టుకున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో కూడా ప్రియా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలు, షూటింగ్ అనుభవాలు, అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆ పోస్ట్‌లో 40 ఏళ్ల తర్వాత మహిళల జీవితం ఎలా మారుతుందో గురించి ఆమె తన భావాలను వ్యక్తం చేశారు. ఈ వయసులో తన ఫ్యాషన్, స్టైల్.. ఆత్మవిశ్వాసం కి తోడయ్యాయి అని చెప్పారు. అయితే అదే సమయంలో.. కొంచెం డేంజరస్ గా కూడా మారాను అంటూ క్యాప్షన్ పెట్టారు.

ప్రస్తుతం ఆమె పోస్ట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె ఆలోచనలను మెచ్చుకుంటే, మరికొందరు చర్చిస్తున్నారు. మొత్తానికి..ప్రియా మరోసారి తన మాటలతో అందరి దృష్టిని ఆకర్షించారు.

ALSO READ: Teja Sajja: చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి గ్లోబల్ షోకి హోస్ట్ వరకూ.. తేజ సజ్జా జర్నీ అదిరింది గురు!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×