E-Paper
Advertisement

Mallishwari: బాహుబలి కంటే 60 ఏళ్ల ముందే చైనాను ఏలిన తెలుగు సినిమా!

Mallishwari: బాహుబలి కంటే 60 ఏళ్ల ముందే చైనాను ఏలిన తెలుగు సినిమా!
Advertisement

Mallishwari: ప్రస్తుతం మనం జపాన్‌లో ‘RRR’ జెండా పాతడం, చైనాలో ‘బాహుబలి’ వందల కోట్లు కొల్లగొట్టడం చూసి.. “తెలుగు సినిమా ఇప్పుడే గ్లోబల్ వెళ్ళింది” అని ఫీల్ అవుతున్నాం. కానీ అసలు సీన్ ఏంటంటే, మన తాతల కాలంలోనే ఒక తెలుగు సినిమా చైనాను ‘షేక్’ చేసేసింది! ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా ప్రమోషన్లు లేవు.. అయినా సరే, 1950ల కాలంలోనే ఒక తెలుగు సినిమా చైనా భాషలోకి డబ్బింగ్ అయ్యి అక్కడి ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ అల్టిమేట్ ‘మాస్టర్ పీస్’ పేరే.. ‘మల్లీశ్వరి’ (1951).

అప్పుడే తెలుగోడి సత్తా చూపించిన ఎన్టీఆర్!
దర్శకరత్న బి.ఎన్. రెడ్డి గారు మలచిన ఈ అద్భుత దృశ్యకావ్యం ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి ‘విజువల్ వండర్’. కృష్ణదేవరాయల కాలం నాటి ‘ప్యూర్ లవ్ స్టోరీ’ ఇది. మన లెజెండరీ హీరో ఎన్టీ రామారావు ‘నాగరాజు’గా, మల్టీ టాలెంటెడ్ భానుమతి ‘మల్లీశ్వరి’గా తమ యాక్టింగ్‌తో సెట్స్ మీద మ్యాజిక్ చేశారు. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ చూస్తుంటే ఒక అందమైన ‘ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్’ వేసినట్టు, ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. అందుకే ఈ సినిమా అప్పట్లోనే ఒక ‘వైబ్’ క్రియేట్ చేసింది.

Advertisement

చైనా బాక్సాఫీస్ వద్ద ‘ధుమ్ము’ రేపిన మల్లీశ్వరి!
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన తొలి ‘పాన్-వరల్డ్’ సినిమా ఇదే అనడంలో డౌటే లేదు. దీని క్రేజ్ ఎలా ఉండేదంటేచైనా రాజధానిలో జరిగిన పెకింగ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌ (1952)లో ప్రదర్శితమైన ఫస్ట్ ఇండియన్ (తెలుగు) మూవీ ఇదే! మార్చి 14, 1953న ఈ సినిమాను చైనీస్ భాషలోకి డబ్బింగ్ చేసి అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. చైనాలో డబ్బింగ్ అయి థియేటర్లలోకి వచ్చిన తొలి తెలుగు సినిమాగా ఇది హిస్టరీ క్రియేట్ చేసింది.ఈ సినిమాను ఇంగ్లీష్‌లోకి కూడా డబ్బింగ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ, అప్పట్లో ఉన్న బడ్జెట్ ప్రొబ్లమ్స్ వల్ల అది వర్కౌట్ కాలేదు. లేదంటే ఆ రోజుల్లోనే ఇది ఆస్కార్ లెవల్‌లో రచ్చ చేసేది!

పాటలే ప్రాణం.. విజువల్స్ అద్భుతం!
సాలూరి రాజేశ్వరరావు  ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికీ టాప్ నాచ్. “ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు”, “మనసున మల్లెల మాలలూగె” వంటి పాటలు ఇప్పటికీ ప్లే లిస్ట్‌లో ఉండాల్సిన మెలోడీలు. ఎన్టీఆర్ కి  మాస్ హీరో ఇమేజ్ రాకముందు, ఒక క్యూట్ రొమాంటిక్ హీరోగా విపరీతమైన ‘ఫ్యాన్ బేస్’ తెచ్చిపెట్టిన సినిమా ఇది. బి.ఎన్. రెడ్డి  తన కెరీర్‌లోనే ‘మల్లీశ్వరి’ నా బెస్ట్ వర్క్ అని ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేవారు కూడా.

Advertisement

ఎందుకు ఈ గ్యాప్ ?
అయితే మల్లీశ్వరి తర్వాత మన మేకర్స్ అంతా కేవలం ‘కమర్షియల్’ సినిమాల మీద, లోకల్ బాక్సాఫీస్ మీదనే ఫోకస్ పెట్టారు. దాంతో విదేశీ మార్కెట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ మళ్ళీ 70 ఏళ్ల తర్వాత రాజమౌళి లాంటి వాళ్ళు అదే చైనా, జపాన్ మార్కెట్లలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపిస్తున్నారు.సింపుల్‌గా చెప్పాలంటే.. నేటి గ్లోబల్ సక్సెస్‌లకు పునాది రాయి ‘మల్లీశ్వరి’. తెలుగు సినిమా గతం ఎంత ‘క్లాసీ’గా ఉండేదో చెప్పడానికి ఇదొక సాలిడ్ ప్రూఫ్!

also read: టాలీవుడ్‌కు ‘పోస్ట్‌పోన్’ వైరస్.. రిలీజ్ డేట్ అంటే ‘జోక్’ అయిపోయిందా?

Related News

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

Big Stories

Advertisement
×