Actress Sreeleela: శ్రీ లీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నటి శ్రీలీల వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పవన్ సినిమాకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా తన సినిమాల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఈ సందర్భంగా మార్చి 19న విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సినిమా మొదటి రోజే థియేటర్లో చూస్తారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో మాస్ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను మరి అది సాధ్యమవుతుందా లేదా అనేది చూడాలి అంటూ తెలిపారు . అలాగే తాను హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం పెళ్లి సందD(Pelli SandaD)సినిమాని తాను ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో చూశానని తెలిపారు. అప్పటివరకు తాను ఫస్ట్ డే ఏ సినిమాకి వెళ్లలేదని అదే తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని తెలిపారు.
ఇకపోతే ఈ సినిమా చూస్తున్న సమయంలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున పేపర్లు చల్లుతూ ఎంజాయ్ చేశారు అయితే ఆ సమయంలో నా మీద పడిన కొన్ని పేపర్లను తాను ఇప్పటికీ చాలా భద్రంగా దాచుకున్నానని శ్రీలీల అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అలా పెళ్లి సందడి సినిమా తరహా లోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థియేటర్ లో చల్లె పేపర్లను తాను ఎక్స్పీరియన్స్ చేయాలని ఆ పేపర్లను కూడా అలాగే భద్రపరుచుకోవాలనుకుంటున్నాను అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఉంది..
ఇలా శ్రీ లీలా చేసిన ఈ వ్యాఖ్యలపై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు పేపర్లు దాచి పెట్టుకోవడం ఏంటి ఇలాంటి పిచ్చి అలవాట్లు మీకు కూడా ఉన్నాయా అంటూ అభిమానులు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు .ఇక ఇటీవల కాలంలో శ్రీలీల నటించిన సినిమాలేవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక శ్రీ లీల కెరియర్ మొత్తం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైనే ఆధారపడి ఉంది. మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సింది. ఇక శ్రీ లీల ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలతో పాటు తమిళ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Sumathi Sathakam OTT: ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న అమర్ దీప్ సుమతీ శతకం.. ఎప్పుడు? ఎక్కడంటే?