E-Paper
Advertisement

Sumathi Sathakam OTT: ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న అమర్ దీప్ సుమతీ శతకం.. ఎప్పుడు? ఎక్కడంటే?

Sumathi Sathakam OTT: ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న అమర్ దీప్ సుమతీ శతకం.. ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Sumathi Sathakam OTT: బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ ప్రస్తుతం హీరోలుగా వెండితెరపై కూడా వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బుల్లితెర నటుడిగా మంచి సక్సెస్ అందుకున్న అమర్ దీప్ చౌదరి సైతం హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గా పాల్గొన్న అమర్ ఈ కార్యక్రమంలో రన్నర్ గా నిలిచారు. ఈ కార్యక్రమం తర్వాత ఈయనకు సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఈటీవీ విన్ లో సుమతీ శతకం..

ఈ నేపథ్యంలోనే అమర్ హీరోగా ఇటీవల సుమతీ శతకం (Sumathi Sathakam)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే . మొదటి సినిమాతోనే అమర్ తన నటనతో వెండితెరపై కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ థియేటర్లలో విడుదల అయింది. ఇలా ఈ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత తిరిగి ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి ఈ టీవీ విన్ (Etv Win)అధికారక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా హక్కులను ఈ టీవీ విన్ కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 19వ తేదీ నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో ప్రసారం కాబోతున్నట్లు తెలియజేశారు.

ఉగాది సందర్భంగా ఓటీటీలోకి సుమతి శతకం..

Advertisement

ఈ సినిమా నుంచి ఒక అద్భుతమైన పోస్టర్ విడుదల చేస్తూ.. ప్రేమ, కలలు, మూఢ నమ్మకాలు వినోద భరితమైన సుమతి శతకం ప్రపంచంలోకి మార్చి 19వ తేదీ అడుగు పెట్టండి అంటూ ఈ సినిమా ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19వ తేదీ విడుదల కాబోతున్న విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమాలో అమర్ జోడిగా శైలీ చౌదరి హీరోయిన్ గా నటించారు
టేస్టీ తేజ, మహేష్ విట్టా, జేడీవీ ప్రసాద్, మిర్చి కిరణ్  తదితరులు ఈ సినిమాలో సందడి చేశారు.

Advertisement

ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో కొనసాగే కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో పెళ్లి అంటే ఎంతో ఇష్టం ఉన్న హీరోకు దాదాపు 99 సంబంధాలు చూసిన పెళ్లి కుదరదు. ఇక 100వ అమ్మాయిగా సుమతిను చూసి అమర్ ప్రేమలో పడతారు. ఈ సినిమాలో హీరోయిన్ అంగన్వాడీ టీచర్ గా సందడి చేశారు. ఇలా సుమతి ప్రేమ కోసం అమర్ రెండు ఊర్ల మధ్య ఎలాంటి సమస్యలను సృష్టించారు ?వాటిని ఏ విధంగా పరిష్కరించారు? చివరికి తన ప్రేమను దక్కించుకున్నారా అనే నేపథ్యంలోనే ఈ సినిమా కొనసాగుతుంది. అమర్ తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకున్నారు ఇక ప్రస్తుతం ఈయన తన తదుపరి చిత్రం చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాలో సురేఖ వాణి కుమార్తె సుప్రీత హీరోయిన్ గా నటించారు.

Also Read: Singer Mangli: మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. బూతు పాటపై కేసు నమోదు..

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×