E-Paper
Advertisement

ప్రేమపై త్రిష ఆసక్తికర పోస్టు.. ప్రేమ లేకపోతే అర్థం లేదంటూ..

ప్రేమపై త్రిష ఆసక్తికర పోస్టు.. ప్రేమ లేకపోతే అర్థం లేదంటూ..
Advertisement

Actress Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిష (Trisha)ఇటీవల కాలంలో తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి అయింది. ఇప్పటికీ కూడా వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇటీవల కాలంలో తన వ్యక్తిగత విషయాల కారణంగా నిత్యం వార్తలలో ఉంటున్నారు. ఈమె నటుడు విజయ్(Vijay) తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో త్రిషకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది.

ప్రేమ పై త్రిష ఆసక్తికర పోస్ట్..

త్రిష విజయ్ ఇద్దరు రిలేషన్ లో ఉన్న నేపథ్యంలోనే విజయ్ భార్య సంగీత తన నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఈమె తన భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ తెలియజేయడంతో త్రిష విజయ్ మధ్య ఉన్న రిలేషన్ నిజమేనని అందరూ భావించారు. ఈ విషయాలకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్న త్రిష మాత్రం ఇప్పటివరకు ఈ వార్తలను ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రిలేషన్ గురించి వచ్చే వార్తలు నిజమేనని త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రతిదీ ప్రేమ కాదు..

Advertisement

ఇకపోతే తాజాగా త్రిష సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక ఆసక్తికరమైన కొటేషన్ షేర్ చేశారు. ఇందులో భాగంగా”ప్రతిదీ ప్రేమ కాదు, కానీ ప్రేమ లేకపోతే దేనికి అర్థం ఉండదు” అంటూ రాసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఈ ఫోటోకి ‘నిజం ‘ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిష ఈ పోస్ట్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. విజయ్ తో లవ్ రిలేషన్ గురించి వార్తలు వస్తున్న సమయంలో ఈమె ఇలా ప్రేమ గురించి పోస్ట్ చేయడంతో ఇది కాస్త చర్చలకు కారణమైంది. ఇక విజయ్ త్రిష తమిళనాడు ఎన్నికలు పూర్తికాగానే వీరి రిలేషన్ గురించి అధికారకంగా తెలియజేస్తూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

చిరంజీవితో విశ్వంభర..

Advertisement

త్రిష కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి నటించిన కరుప్పు సినిమా మే 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా తెలుగులో వీరభద్రుడు అనే పేరుతో విడుదల కానుంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవితో కలిసి త్రిష విశ్వంభర అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత మరోసారి విశ్వంభర ద్వారా వెండి తెరపై సందడి చేయబోతున్నారు.

Also Read: ఇట్స్ అఫీషియల్… అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి…కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×