E-Paper
Advertisement

ఆ సినిమా కోసం కొత్త ప్రయోగం చేసిన యామీ గౌతమ్ .. డెడికేషన్ కి ఫిదా అవ్వాల్సిందే!

ఆ సినిమా కోసం కొత్త ప్రయోగం చేసిన యామీ గౌతమ్ .. డెడికేషన్ కి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Yami Gautam: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీలు సినిమాల కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధమవుతారు. వారికి తెలియని విషయాలను తెలుసుకోవడం కోసం అలాగే కొన్ని విషయాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ మరి సినిమాలలో నటిస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్క సినిమాకి ఎన్నో కొత్త విషయాలను నటీనటులు నేర్చుకుంటూనే ఉంటారు. ఇలా సినిమాలపై మక్కువతోనే సెలబ్రిటీలు ఎంత కష్టమైనా సినిమా కోసం సాహసాలు చేస్తుంటారని చెప్పాలి. తాజాగా నటి యామి గౌతమ్(Yami Gautham) సైతం తన సినిమా కోసం ఒక కొత్త ప్రయోగం చేశారు. ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)తో కలిసి హక్(Haq) సినిమాలో నటించారు.

నెట్‌ఫ్లిక్స్‌ హాక్ మూవీ స్ట్రీమింగ్..

ఈ సినిమాలో యామి గౌతమ్ ముస్లిం మహిళ షాజియా బానో అనే పాత్రలో కనిపించారు. ఇలా ఈ సినిమాలో ముస్లిం అమ్మాయిగా కనిపించిన యామి గౌతమ్ ఈ సినిమా కోసం ఖురాన్(Quran) చదవడం నేర్చుకున్నట్లు తెలుస్తోంది.దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైన ‘షా బానో’ కేసు ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్రలో యామి గౌతమ్ నటించారు. ఈ సినిమాకు సుపర్ణ్ వర్మ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.

నాలుగు నెలల ఖురాన్ నేర్చుకున్న నటి..

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారమవుతున్న నేపథ్యంలో డైరెక్టర్ సుపర్ణ్ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. ఈ సినిమా కోసం యామి గౌతమ్ షాజియా పాత్రలో నటించడం కాదు జీవించారని ఈయన తెలియజేశారు. ఈ సినిమా కోసం ఖురాన్ చదవటాన్ని స్వయంగా తానే నేర్పించాను. ఆ పవిత్ర గ్రంథంలోని మాండలికం, అరబిక్ పదాల ఉచ్చారణను అర్థం చేసుకోవడానికి ఆమెకు ఏకంగా నాలుగు నెలల సమయం పట్టిందని తెలిపారు.

గౌరవం సినిమాలో నటించిన యామి గౌతమ్..

Advertisement

ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా సినిమాలో నటించడం కోసం ఈమె ఏకంగా ఖురాన్ చదవడం నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. సినిమా పట్ల ఎంతో డెడికేషన్ ఉంటే తప్ప ఇలాంటివి సాధ్యం కాదంటూ ఈమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ సినిమాలో యామీ గౌతమ్ తన హక్కుల కోసం భర్తతో న్యాయపోరాటం చేసే సాహసభరితమైన మహిళగా కనిపించారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ ఈమెకు భర్త పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. థియేటర్లలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. మరి ఇక్కడ ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందనేది తెలియాల్సి ఉంది. ఇక యామి గౌతమ్ తెలుగులో కూడా అల్లు శిరీష్ హీరోగా నటించిన గౌరవం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తెలుగులో ఈమె నటించినది చాలా తక్కువ సినిమాలే అని చెప్పాలి.

Also Read: ప్రభాస్ వర్సెస్ సల్మాన్ బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ గెలిచేదెవరు?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×