E-Paper
Advertisement

ప్రభాస్ వర్సెస్ సల్మాన్ బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ గెలిచేదెవరు?

ప్రభాస్ వర్సెస్ సల్మాన్ బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ గెలిచేదెవరు?
Advertisement

Prabha vs Salman Khan: బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని సందర్భాలలో సినిమాలు పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తే నువ్వా నేనా అనే విధంగా బాక్సాఫీస్ బరిలో దిగుతుంటారు. ఇక 2027వ సంవత్సరంలో పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) కు పోటీగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) పోటీకి దిగుతున్నారు.

సల్మాన్ ఖాన్ vs ప్రభాస్…

ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి(Sandeep Reddy) వంగ దర్శకత్వంలో స్పిరిట్ (Spirit)సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5వ తేదీ విడుదల చేయబోతున్నట్లు సందీప్ రెడ్డి ఇదివరకే అధికారకంగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఇక ప్రభాస్ సినిమాకు పోటీగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా స్పిరిట్ సినిమాకు పోటీగా విడుదల కాబోతుందని తెలుస్తోంది. వంశి పైడిపల్లి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో సినిమాని అధికారకంగా ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

2027 ఈద్ న సల్మాన్ ఖాన్ సినిమా విడుదల..

Advertisement

రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027 ఈద్ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇక 2027 ఈద్ పండుగ మార్చి 7వ జరగనుంది. ఇలా మార్చి ఏడో తేదీ సల్మాన్ ఖాన్ సినిమా, మార్చి 5న స్పిరిట్ విడుదల అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కచ్చితంగా గట్టి పోటీగా ఉండబోతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అభిమానులు ఈ సినిమాల విడుదల విషయంలో ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు యధావిధిగా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తాయా లేదంటే విడుదల విషయంలో మార్పులు చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

2027 బాక్సాఫీస్ కింగ్ ఎవరు?

Advertisement

ఇక సల్మాన్ ఖాన్ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలు మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి 2027లో మహేష్ బాబు వారణాసి అల్లు అర్జున్ రాకా, ఎన్టీఆర్ డ్రాగన్ 2 సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. మరి 2027 బాక్సాఫీస్ కింగ్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: పెద్ది రిలీజ్ డేట్ కన్ఫర్మ్… అఖిల్ సినిమా మళ్ళీ వాయిదా వేయాల్సిందేనా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×