E-Paper
Advertisement

ఆదా శర్మలో ఈ టాలెంట్ ఉందా..? అస్సలు ఊహించలేదు భయ్యా..

ఆదా శర్మలో ఈ టాలెంట్ ఉందా..? అస్సలు ఊహించలేదు భయ్యా..
Advertisement

Adah Sharma : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆదాశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.. మూవీ పెద్దగా హిట్ అవ్వకపోయినా ఈమె అందానికి మార్కులు బాగా పడ్డాయి. దాంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. అయితే ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా సెకండ్ హీరోయిన్ గానే చేసినవే.. హీరోయిన్గా చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోయినా సెకండ్ హీరోయిన్గా పరవాలేదు అని అనిపించాయి.. ఈమధ్య ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటుంది. అయితే ఆదాశర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా తనకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఆ వీడియోలో ఈ ముద్దుగుమ్మ టాలెంటు చూపించింది. అధి కాస్త ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఆమెలో దాగి ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో ఒకసారి చూసేద్దాం..

ఆదా నీ టాలెంట్ కు ఫిదా..

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్గా కొనసాగుతున్న హీరోయిన్లకు ఏదొక టాలెంట్ ఉన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు తమలోని స్పెషల్ టాలెంట్ ని అభిమానులతో పంచుకున్నారు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క టాలెంట్ ని పరిచయం చేయడంతో పాటుగా వాళ్ళు చేసిన కొన్నిటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ఆదాశర్మకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.. ఏదో ఒక ప్రెస్ మీట్ కి వెళ్ళిన ఆదా శర్మ అక్కడ తన టాలెంట్ ని బయట పెట్టింది. ఆ వీడియోలో ఆమె కొన్ని బర్డ్స్ గొంతును క్రియేట్ చేసింది. అది విన్న అభిమానులు ఆదా టాలెంట్ కి ఫిదా అయ్యారు.. ఆ వీడియోని మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి..

ఆదా సినిమాల విషయానికొస్తే..

Advertisement

ఈ అమ్మడు ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, నటిగా తన విశ్వరూపాన్ని చూపించింది.. ఈమధ్య డిఫరెంట్ స్టోరీలతో సినిమాలను ఎంపిక చేసుకుంటుంది.. కథలు విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతుంది ఈ ముద్దుగుమ్మ. మరి నెక్స్ట్ తెలుగులో ఏ హీరో సరసన నటిస్తుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఇక సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉండే ఈ ముద లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది.. ఆ ఫోటోలు ఎంతగా ట్రెండ్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×