Virat Kohli Fan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 39 మ్యాచులు ఫినిష్ అయ్యాయి. ఇవాళ 40వ మ్యాచ్ కూడా జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Delhi Capitals vs Royal Challengers Bengaluru) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన బెంగుళూరు 9 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన ఓ సంఘటన వైరల్ గా మారింది.
ఢిల్లీలో బెంగళూరు బస చేసిన హోటల్ లో విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ( Virat Kohli autograph ) కోసం ఓ బుడ్డోడు ప్రయత్నించాడు. తన చిన్ని బ్యాట్ ను పట్టుకొని, విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం పరిగెత్తాడు. అయితే ఆ బుడ్డోడిని కన్నెత్తి కూడా చూడలేదు విరాట్ కోహ్లీ. అతన్ని చూడకుండానే హోటల్ నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఎమోషనల్ అయినా ఆ బుడ్డోడు… బ్యాట్ ను నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇది చూసిన నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. విరాట్ కోహ్లీకి ( Virat Kohli ) ఇంత బలుపు ఎందుకు ? ఆ బుడ్డోడు కనిపించడం లేదా? కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకుపోయాయా ? అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Delhi Capitals vs Royal Challengers Bengaluru) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ క్రమంలో 16.3 ఓవర్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్… 75 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. అయితే ఈ లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలో ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విక్టరీ అందుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. తన 19 సంవత్సరాల ఐపీఎల్ కెరీర్ లో 9000 పరుగులు సాధించి, హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు ఈ స్థాయిలో ఐపిఎల్ లో ఎవరూ పరుగులు చేయలేదు. ఇకపైన ఈ తొమ్మిది వేల పరుగులను ఎవరు బ్రేక్ చేసే అవకాశం లేదని కూడా అంటున్నారు.
?igsh=MWo3cmYwbnJ3c3Q0aQ==