E-Paper
Advertisement

కాజల్ తో రొమాన్స్ చేసే అవకాశం మిస్ చేసుకున్న అడివి శేష్!

కాజల్ తో రొమాన్స్ చేసే అవకాశం మిస్ చేసుకున్న అడివి శేష్!
Advertisement

Adivi sesh:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అడివి శేష్ (Adivi shesh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటనతో హ్యాండ్సమ్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈయన.. తాజాగా నటిస్తున్న చిత్రం డెకాయిట్. షానీల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అడివి శేష్ కి జోడీగా, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అవ్వగా.. అంచనాలు పెంచేసింది. మరోవైపు హీరో అడివి శేష్ ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటూ సినిమా గురించి తన కెరియర్ గురించి ఎన్నో విషయాలు పంచుకుంటున్నారు అందులో భాగంగానే.. కాజల్ తో రొమాన్స్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లు తెలిపారు.

కాజల్ తో రొమాన్స్.. గొప్ప ఛాన్స్ మిస్..

అడివి శేష్ మాట్లాడుతూ.. “కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో నవదీప్ పాత్రకు మొదట కృష్ణవంశీ నన్నే ఎంపిక చేశారు. అయితే నా నటన ఆయనకు అంత సంతృప్తిగా అనిపించలేదు. కొన్ని రోజులకు నన్ను ఆ సినిమా నుండి తీసేసి నా పాత్రలో మళ్ళీ నవదీప్ ను తీసుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమాకి మొదట ‘మల్లెపువ్వు’ అని టైటిల్ పెట్టారు. కానీ కొన్ని రోజులు షూటింగ్ తర్వాత ‘చందమామ’గా మార్చడం జరిగింది” అంటూ అసలు విషయం బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు అడివి శేష్.

హర్ట్ అవుతున్న ఫ్యాన్స్..

Advertisement

ఇకపోతే చందమామ అలియాస్ కాజల్ పక్కన నటించే గొప్ప అవకాశాన్ని అడివి శేష్ కోల్పోవడంతో కాజల్ పక్కన, అందులోనూ అలాంటి పాటలు .. అడివి శేష్ అన్న మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే నటనతో మెప్పించలేక ఆ ఛాన్స్ కోల్పోయానని నిజాయితీగా ఒప్పుకోవడంతో ఆయన వ్యక్తిత్వానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు

చందమామతో ఊహించని క్రేజ్ అందుకున్న కాజల్..

చందమామ సినిమా విషయానికి వస్తే.. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో నవదీప్ – కాజల్ జంటగా నటించగా.. శివబాలాజీ – సింధు మీనన్ జంటగా నటించారు . కాజల్ అగర్వాల్ ఈ సినిమాతో చందమామగా ముద్ర వేయించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ మరో సినిమా అందించలేదనే చెప్పాలి.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అటు వరుసగా అవకాశాలు లభించాయి. రాధాకృష్ణ అందించిన మ్యూజిక్ బీట్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి కల్ట్ క్లాసిక్ గా నిలిచింది ఈ సినిమా.

Advertisement

ALSO READ:అల్లు అర్జున్ ‘రాకా’లో నీలాంబరి ఫిక్స్.. ఎదురెళ్తుందా? అండగా నిలుస్తుందా?

అందరి చూపు గూఢచారి 2 వైపే..

అడివి శేష్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి వసూళ్లు సాధించే నటులలో ఒకరిగా పేరు దక్కించుకున్న అడివి శేష్ తన కథల ఎంపిక. రచనా నైపుణ్యాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే డెకాయిట్ తర్వాత ఆయన నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం గూఢచారి 2 . ఆయన అభిమానులే కాదు ఇప్పుడు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×