E-Paper
Advertisement

అల్లు అర్జున్ ‘రాకా’లో నీలాంబరి ఫిక్స్.. ఎదురెళ్తుందా? అండగా నిలుస్తుందా?

అల్లు అర్జున్ ‘రాకా’లో నీలాంబరి ఫిక్స్.. ఎదురెళ్తుందా? అండగా నిలుస్తుందా?
Advertisement

Raaka Movie:సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందంటే చాలు ఆ సినిమా టైటిల్ కొన్ని నెలల ముందే లీక్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆడియన్స్ ఏ టైటిల్ అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తారో.. దాదాపు ఆ సినిమాలకు అవే టైటిల్స్ ఫిక్స్ అవుతూ ఉంటాయి. అయితే అట్లీ -అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ విషయంలో మేకర్స్ తీసుకున్న పగడ్బందీ భద్రత అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచి ఎన్నో రకాల వార్తలు వినిపించినప్పటికీ.. ఎక్కడా రూమర్స్ కి, గాసిప్స్ కి చిత్ర బృందం చోటు ఇవ్వకుండా.. సడన్గా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఎవరూ ఊహించని గెటప్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేయడమే కాకుండా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టైటిల్ ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది చిత్ర బృందం.

అల్లు అర్జున్ రాకా మూవీలో రమ్యకృష్ణ..

రాకా అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ.. రగ్గడ్ లుక్ లో గుండుతో అల్లు అర్జున్ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు ఇందులో అల్లు అర్జున్ హీరోగా విలన్ గా రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు విలన్ పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేశారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . ఏది ఏమైనా అల్లు అర్జున్ ఈమధ్య కాలంలో భిన్న విభిన్నమైన పాత్రలతో ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా.. తన ఉనికిని కూడా పెంపొందించుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో గత కొంతకాలంగా నీలాంబరి అలియాస్ రమ్యకృష్ణ (Ramya Krishnan) నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవి ఊహాగానాలు మాత్రమే అనే కామెంట్లు వచ్చాయి. కానీ ఈ విషయాన్ని స్వయంగా రమ్యకృష్ణ తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది.

ఒక్క పోస్టుతో క్లారిటీ..

Advertisement

తాజాగా రమ్యకృష్ణ తన ఇంస్టాగ్రామ్ వేదికగా రాకా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేస్తూ..” పరిధిలకు అతీతమైన ఒక దృశ్యం కోసం సిద్ధంకండి” అంటూ ఆమె క్యాప్షన్ జోడించింది. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సినిమాలో మీరు కూడా భాగమైనట్లే కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నీలాంబరిగా అల్లు అర్జున్ కు ఎదురెళ్తుందా? లేక శివగామిలా అల్లు అర్జున్ కు అండగా నిలుస్తుందా? అన్న విషయం తెలియాల్సి ఉంది. అటు నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రతో విలన్ గా నటించి అద్భుతమైన నటిగా పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇటు శివగామిగా బాహుబలి చిత్రంలో రాజసం ఉట్టిపడే పాత్ర చేసి అందర్నీ మెప్పించింది .మరి రాకా మూవీలో రమ్యకృష్ణ పాత్ర ఎలాంటిదో తెలియాల్సి ఉంది.

ALSO READ:Allu Arjun Raaka Movie: రాకా అర్థం ఏంటో తెలుసా?

భారీ బడ్జెట్ తో వస్తున్న రాకా..

Advertisement

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది . ఈమెతో పాటు మరో ఐదు మంది హీరోయిన్లు నటిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇందులో ఎవరెవరు అనే విషయంపై ఇంకా చిత్ర బృందం స్పందించలేదు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి సుమారుగా రూ. 800 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×