Budget Air Conditioners: తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకు మరింత పెరిగిపోతోంది. భానుడి తాపాన్ని తట్టుకోలేక పెద్ద ఎత్తున ప్రజలు ఏసీలను ఆశ్రయిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు సైతం తక్కువ బడ్జెట్ లో లభించే ఏసీలు కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల బ్రాండ్ గా పేరొందిన డైకిన్ కంపెనీ నుంచి.. 1 టన్ సెగ్మెంట్ లో సాలిడ్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. రీజనబుల్ బడ్జెట్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఏసీలు.. సమ్మర్ లో అత్యంత చల్లదనాన్ని పంచనున్నాయి. ఈ డైకిన్ 1 టన్ ఏసీల్లోని ప్రధాన ఫీచర్లు, ధర వివరాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
డైకిన్ కంపెనీకి చెందిన ఈ ఏసీ బడ్జెట్ లో అత్యంత ప్రజాధరణ పొందిన మోడల్ గా గుర్తింపు పొందింది. ఇది రూ. 32,990 – 33,500 మధ్య అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 3D ఎయిర్‌ఫ్లో, ట్రిపుల్ డిస్‌ప్లే, డ్యూ క్లీన్ టెక్నాలజీ (ఆటోమేటిక్ కాయిల్ క్లీన్ చేస్తుంది) ఉన్నాయి. తక్కువ ధరలో అత్యుత్తమ ఇన్వర్టర్ టెక్నాలజీని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది.
తక్కువ విద్యుత్ ను వినియోగించి పవర్ బిల్లును ఆదా చేసే ఏసీ కోరుకుంటే దీనిని పరిశీలించవచ్చు. ఇది డైకిన్ ఏసీ 5 స్టార్ రేటింగ్ తో వసతుంది. రూ.35,990 – 39,400 మధ్య మార్కెట్లో లభిస్తోంది. దీనిలోని కోండో ఎయిర్ ఫ్లో టెక్నాలజీ.. చల్లటి గాలి నేరుగా మనుషులకు తగలకుండా గది మెుత్తానికి వ్యాపించేలా చేస్తుంది. అలాగే దీనిలోని PM 2.5 ఫిల్టర్ గాలిలోని దుమ్ము, దూళిని తొలగించి స్వచ్ఛమనై చల్లదనాన్ని అందిస్తుంది.
ఇన్వర్టర్ అవసరం లేని వారికి, తక్కువ వాడకం ఉన్న గదుల కోసం ఈ బేసిక్ డైకిన్ ఏసీ సరిగ్గా సరిపోతుంది. మార్కెట్ లో రూ.31,000 – 32,000 మధ్య దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనిలోని పవర్ చిల్ ఫీచర్.. గదిని చాలా వేగంగా చల్లబరుస్తుంది. డైకిన్ మోడల్స్ లో లభించి అత్యంత చవకైన మోడల్ గా ఇది గుర్తింపు పొందింది.
ఈ 4 స్టార్ ఏసీ.. 3 స్టార్ ఏసీల కంటే బెటర్ గా విద్యుత్ ను ఆదా చేస్తుంది. సుమారు రూ.34,000కు ఈ ఏసీ మార్కెట్ లో అందుబాటులో ఉంది. 100 శాతం కాపర్ కాయిల్స్, హీప్టా సెన్స్ (7 రకాల సెన్సార్లు), తక్కువ శబ్దంతో పనితీరు వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది.
Also Read: Bumrah Tattoo: ప్రైవేట్ పార్ట్ పై బుమ్రా పేరు టాటూ వేసుకున్న హాలీవుడ్ భామ
గదిలో గోడలు చిన్నగా ఉండే వాటికి తగ్గట్లు సరిపోయే కాంపక్ట్ ఏసీని కోరుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. దీని ధర రూ.32,890. దీనిలో కరెంటును ఆదా చేసే ఎకనా మోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఏదైనా సమస్య ఉంటే రిమోట్ లో తెలియజేసే విధంగా సెల్ఫ్ డయాగ్నసిస్ ఫీచర్ ను సైతం ఇది కలిగి ఉంది. చిన్న బెడ్ రూమ్ లకు, ఆఫీసు క్యాబిన్లకు ఇది సరిగ్గా సరిపోతుంది.
Also Read: మహికా శర్మపైన పెట్టిన ఫోకస్, ముంబై ఇండియన్స్ పైన పెట్టు..హార్దిక్ పాండ్యాపై ట్రోల్స్