E-Paper
Advertisement

Tollywood: ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్.. స్టార్ హీరోల జడల్ జమానా లుక్ అదుర్స్!

Tollywood: ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్.. స్టార్ హీరోల జడల్ జమానా లుక్ అదుర్స్!
Advertisement

Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ “జడల్ జమానా” అంటూ సోషల్ మీడియాలో హడల్ పుట్టిస్తోంది. ముఖ్యంగా రెండు జడలతో మన స్టార్ హీరోలు కనిపిస్తున్న తీరుకి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏంటా ఈ రెండు జడల కథ ఇప్పుడు చూద్దాం.

రెండు జడలతో స్టార్ హీరోలు..

సాధారణంగా నిత్యం ఫ్యాన్స్ వార్ తో కాలక్షేపం చేసే సినిమా ఔత్సాహిక తెలుగు ట్విట్టర్ యువత..ఏదైనా ఒక టాపిక్ పట్టుకున్నారు అంటే దానిని కొన్ని రోజులపాటు వైరల్ చేసేదాకా వదిలిపెట్టరు. ఆ విధంగానే ఇప్పుడు కొత్తగా జడల ట్రెండు మొదలుపెట్టారు. ఎక్స్ , ఇంస్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఎక్కువగా ఈ జడలే కనిపిస్తున్నాయి స్టార్ హీరోల దగ్గర నుండి యంగ్ హీరోల వరకు అందరూ జడలతో దర్శనమిస్తూ ఉండడం గమనార్హం.

ఈ క్రేజీ ట్రెండ్ పుట్టుకకు కారణం?

Advertisement

ఇకపోతే ఈ జడల ట్రెండ్ కి ముఖ్య కారకుడు టాలీవుడ్ హీరో నాని (Hero Nani)అనే చెప్పాలి. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odala) దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నాని హీరోగా నటిస్తున్నారు. ఎన్నో రోజులుగా సెట్స్ మీదే ఉన్న ఈ సినిమా ఇప్పుడు విడుదల తేదీని మార్చుకుంది.. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు మూడో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నాని బర్తడే సందర్భంగా మంగళవారం రోజు “ఆయా షేర్” అనే ఒక పాటను విడుదల చేశారు. దీని కారణంగానే ఇప్పుడు ఈ జడల్ జమానా ట్రెండ్ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా అనిరుద్ రవిచంద్రన్ అందించిన ట్యూన్ జనాలకు బాగా ఎక్కేసింది. ఇప్పుడొచ్చిన ఆయా షేర్ పాటలో జడల పాత్రను నాని ఎలివేట్ చేశారు. పైగా జడలు వేసుకొని నాని వేసిన డాన్స్, సిగరెట్ వెలిగించుకుంటూ వేసిన హుక్కు స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.వీటికి ఫిదా అయిపోయిన నెటిజన్లు తమ అభిమాన హీరోలకి కూడా ఇలా ఎడిటింగ్ ద్వారా అదే రకమైన జడలు సెట్ చేస్తూ డీపీలుగా పెట్టుకోవడం వైరల్ గా మారింది.

also read:Vijay – Rashmika: “విరోష్” జంటకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ నుండి సీనియర్ కమెడియన్స్ వరకు..

Advertisement

ఇకపోతే ఈ జడల్ జమానా ట్రెండును.. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ కి కూడా ఏకంగా అభిమానులు రెండు జడలు పెట్టి ప్రభాస్ లుక్ ను విడుదల చేశారు.. ఒక ప్రభాస్ ను మాత్రమే కాదు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అంటే హీరోలకు రెండు జడలు వేసి వారి లుక్ ను మార్చేశారు. అలాగే నిర్మాత ఎస్ కే ఎన్ కి కూడా రెండు జడలు తగిలించేసారు. అంతే కాదండోయ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కి కూడా ఈ రెండు జడలు తగిలించడం వైరల్ గా మారుతోంది. మొత్తానికైతే ఈ జడల్ జమానా ట్రెండ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని చెప్పవచ్చు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×