Peddi Movie : మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో పెద్ద సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.. మోస్ట్ అవైటెడ్ మూవీ గా రాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. అనుకున్న టైం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఉంటే ఈపాటికి రిలీజ్ అయ్యేది కూడా.. భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న సినిమా మంచి అంచనాలు సెట్ చేసుకుంది.. ఈ మూవీ ఈనెల ఏప్రిల్ 30న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని కూడా జనాలని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చికిరి చికిరి సాంగ్ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను రిలీజ్ చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటో ఒకసారి చూసేద్దాం…
రామ్ చరణ్, బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మొదటి సాంగ్ చికిరి చికిరి వచ్చింది.. రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ట్రెండ్ అవుతూనే ఉంది. ఇందులో రెండవ పాటను మేకర్స్ రిలీజ్ చెయ్యనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక మాస్ సాంగ్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తుండగా.. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ సాంగ్ రాబోతుందని ఇండస్ట్రీలో రూమర్స్ వినిపించాయి. అయితే అందులో నిజం లేదు.. రెండో పాటను మార్చి రెండో వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ఒక ఆఫీషియల్ ప్రకటన రాబోతుందని టాక్…
Also Read :ఉదయ్‌పూర్ లో అంబానీ ల్యాండ్ .. విజయ్ – రష్మిక పెళ్లికోసమేనా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గత ఏడాది నటించిన గేమ్ ఛేంజర్ మూవీ డీలా పడింది. అనుకున్న ఫలితం అయితే అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు రాబోతున్న పెద్ది మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని మెగా అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు నటిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెట్ ఆటగాడి రా కనిపిస్తున్నాడు.. ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలని బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో నుంచి రాబోతున్న రెండో పాట ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.. ఇదిలా ఉండగా ఈ మూవీ ని మార్చ్ 26న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్సలహాలు చేసింది. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అవుతుండడంతో పెద్ది వాయిదా పడింది… ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. ఇక ఇప్పటికే ఈ మూవీ బిజినెస్ డీల్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. మరి రిలీజ్ అయ్యాక పెద్ది మూవీ రామ్ చరణ్ కు బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది ఏమో చూడాలి..