Aishwarya Rajesh: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంటనే అవకాశాల కోసం ఎంతోమంది క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలాంటి లైంగిక వేధితులకు గురైన వారందరూ కూడా వారి జీవితంలో జరిగిన చేదు సంఘటనలను పలు సందర్భాలలో బయటపెడుతున్నారు. తాజాగా నటి ఐశ్వర్య రాజేష్ సైతం ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన జీవితంలో ఎదురైనా చేదు సంఘటనల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఫోటోషూట్ కోసం ఒక స్టూడియోకి వెళ్ళానని అయితే తన బ్రదర్ తో కలిసి అక్కడికి వెళ్ళగా తన బ్రదర్ ను బయటే ఉండమని చెప్పి ఫోటోల కోసం నన్ను లోపలికి తీసుకెళ్లారు. అయితే ఆ ఫోటోగ్రాఫర్ మాత్రం నాకు సె* లోదుస్తులు ఇచ్చి ఇవి వేసుకుని రమ్మని చెప్పారు. ఇవి వేసుకో నీ శరీరం నేను చూడాలి అంటూ ఆ ఫోటోగ్రాఫర్ తనని బలవంతం చేశారని ఐశ్వర్య రాజేష్ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. అయితే అప్పట్లో నాకు ఈ విషయాలు పెద్దగా అర్థమయ్యేది కాదు బహుశా వారు మరింత ఒత్తిడి చేసి ఉంటే వేసుకునే దాన్నేమో అంటూ ఈమె మాట్లాడారు.
ఇలా అయోమయ పరిస్థితులలో ఉన్న నేను ఒకసారి మా బ్రదర్ తో మాట్లాడతానని బయటకు వచ్చాను. ఇక అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయానని ఐశ్వర్య రాజేష్ తనపై జరిగిన లైంగిక వేధింపులు గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇండస్ట్రీ బయట కూడా మహిళల పట్ల ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని ఈమె మాటలు ద్వారా స్పష్టమవుతుంది.ఒక ఐశ్వర్య రాజేష్ మాత్రమే కాదు ఇలా ఎంతోమంది ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపులకు గురి అయ్యారని పలు సందర్భాలలో బయట పెడుతూ వచ్చారు. ఇక సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఎంతోమంది అవకాశాల కోసం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ పలువురు వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.
సంక్రాంతికి వస్తున్నాం..
ఇలాంటి సమయంలోనే ఐశ్వర్య రాజేష్ లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు . ఈమె గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సినిమాని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం ఐశ్వర్య రాజేష్ కెరియర్ పరంగా వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.
Also Read: SSR 61: 90 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టనున్న సింగీతం శ్రీనివాస్..