E-Paper
Advertisement

Manchi Reddy Kishan Reddy: కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు.. విచారణ పేరిట చిల్లర వేషాలు వేస్తున్నారా..?

Manchi Reddy Kishan Reddy: కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు.. విచారణ పేరిట చిల్లర వేషాలు వేస్తున్నారా..?
Advertisement

Manchi Reddy Kishan Reddy: స్వేఛ్చ బ్యూరో: ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్(KCR) పై వివిద విచారణల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తున్నదని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి(Manchi Reddy Kishan Reddy) మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కావాలనే కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీశ్ రావు(harish Rao)లను సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారని, దీనికి నిరసనగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు, తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు.

సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం

కాళేశ్వరం మీద కమీషన్లు వేసి కేసీఆర్ మీద బురద చల్లడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయని చెప్పారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) విచారణ పేరుతో జరుగుతున్న తతంగాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా సిట్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సీఆర్పీసీ 160 కింద సాక్ష్యాలుగా విచారణకు పిలిచి గంటలు గంటలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా విచారణ చేస్తున్నారని అన్నారు. రెండేళ్లుగా ఈ కేసులో సాదించింది ఏమీ లేదని , కేవలం కాంగ్రెస్ హామీలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. సెలవు రోజుల్లో విచారణలు, కూల్చివేతలు చేయవద్దని హైకోర్టు ఎన్నిమార్లు మొట్టికాయలు వేసినా మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు.

Advertisement

Also Read: Operation Smile: జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆపరేషన్ స్మైల్‌ విజయవంతం.. బాలబాలికలు సేఫ్!

రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధం

చట్టాలను గౌరవించడం, న్యాయస్థానాల ఆదేశాలను పాటించడం కాంగ్రెస్ పాలకులకు అలవాటు లేదని చెప్పారు. టెలిగ్రాఫిక్ చట్టం పరిధిలోనే జరిగిన విషయాలను కావాలనే సిట్ విచారణ పేరిట ఏండ్లుగా సాగదీసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ మీద జరుగుతున్న కుట్రలు తెలంగాణ ప్రజల మనసులను గాయపరిచాయని చెప్పారు. దీని ఫలితాలను తగు రీతిలో కాంగ్రెస్ నాయకులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెండు నెలల క్రితం ఇవ్వవలసిన రైతుబంధు ఊసెత్తకుండా ఉండడం కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ విచారణ పేరుతో జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో ఆదివారం బైక్ ర్యాలీలు, నిరసనలు శాంతియుతంగా జరపాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Also Read: SSR 61: 90 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టనున్న సింగీతం శ్రీనివాస్..

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×