E-Paper
Advertisement

బతకనివ్వరా..? అంటూ తిరుపతిలో రషా తడానీతో ఘట్టమనేని వారసుడి రొమాన్స్!

బతకనివ్వరా..? అంటూ తిరుపతిలో రషా తడానీతో ఘట్టమనేని వారసుడి రొమాన్స్!
Advertisement

Jayakrishna Debut : అజయ్ భూపతి..RX 100 సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ పేరు చేసిన సౌండ్ అంతా ఇంతా కాదు. ఇక మహాసముద్రం తో డిజాస్టర్ ఫేస్ చేసినా ఆ తర్వాత వచ్చిన ‘మంగళవారం’ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సెన్సేషనే క్రియేట్ చేశాడు.అలాంటి క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి ప్రధాన కారణం ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కానుండటమే. యస్ ..సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఈ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తున్నాడు.

మంగా మంగా’ సాంగ్ ప్రోమో సోషల్ మీడియా షేక్

Advertisement

ఇక సినిమాలోని జయకృష్ణ లుక్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుండగా, తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘మంగా మంగా’ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.తిరుపతి బ్యాక్ డ్రాప్ లో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెకు ఇది తొలి తెలుగు సినిమా కావడం విశేషం. తాజాగా విడుదలైన ప్రోమోలో “కొత్తగా తిరుపతికొచ్చిన కుర్రోళ్ళని బతకనివ్వరా..? అన్నదమ్ములు లేరా మీకు?” అంటూ సాగే లిరిక్స్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయ్.హీరోయిన్ అందానికి ఫిదా అయిపోయిన హీరో, తన మనసులోని భావాలను మాస్ అండ్ క్యూట్ స్టైల్‌లో వ్యక్తం చేయడం ఈ పాటలో హైలైట్‌ అని చెప్పాలి.ఇక రషా తడానీ గ్లామర్, జయకృష్ణ ఈజ్ అండ్ మాస్ లుక్ చూస్తుంటే సిల్వర్ స్క్రీన్ పై ఈ జోడీ మ్యాజిక్ చేయడం ఖాయమనిపిస్తోంది.

మే 13వ తేదీన  ఫుల్ సాంగ్‌ను రిలీజ్

Advertisement

ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ ట్యూన్స్ సంగీతం అందించగా మోస్ట్ అవైటెడ్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించడం విశేషం.ఇక ఈ పాటకి సింగర్ రేవంత్ తనదైన ఎనర్జిటిక్ వాయిస్‌తో ప్రాణం పోశారనే చెప్పాలి.ఇక మే 13వ తేదీన ఈ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచగా, ఇప్పుడు ఈ సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్ లోకి రావడం విశేషం. ఇక వైజయంతీ మూవీస్ లాంటి ప్రెస్టేజియస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారంటే సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది.

ఇదొక సరికొత్త ఎమోషనల్ లవ్ స్టోరీ

అజయ్ భూపతి విషయానికి వస్తే ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ సినిమాల్లోని ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాకి వస్తే ఇదొక సరికొత్త ఎమోషనల్ లవ్ స్టోరీని టచ్ చేయబోతున్నాడని వదిలిన అప్ డేట్స్ ని బట్టే అర్థమవుతుంది.ముఖ్యంగా ఘట్టమనేని అభిమానులు తమ అభిమాన హీరో వారసుడిని సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు కూడా. ముఖ్యంగా జయకృష్ణ డ్యాన్స్‌లో కూడా తాత కృష్ణ, బాబాయ్ మహేష్ బాబుల ఛాయలు కనిపిస్తున్నాయని మురిసిపోతూ కామెంట్స్ పెట్టేస్తున్నారు మూవీ లవర్స్. ఇక ప్రస్తుతం యమ జోరుగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ లేదా జులైలో రిలీజ్ కావొచ్చు అన్న టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ముచ్చటగా మూడో తరం వారసుడిగా వస్తున్న జయకృష్ణ ఆ వారసత్వాన్ని నిలబెడతాడో లేదో !

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×