E-Paper
Advertisement

Kavitha Summons: కవితకు బిగ్ షాక్.. రైల్ రోకో కేసులో సమన్లు.. కోర్టుకు రావాలని ఆదేశాలు

Kavitha Summons: కవితకు బిగ్ షాక్.. రైల్ రోకో కేసులో సమన్లు.. కోర్టుకు రావాలని ఆదేశాలు
Advertisement

Kavitha Summons: తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవితకు.. సికింద్రాబాద్ రైల్వే కోర్టు షాకిచ్చింది. రైల్ రోకో కేసుకు సంబంధించి రేపు (బుధవారం) విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ లోని సెకండ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు రావాలని సమన్లలో సూచించింది. కాగా రైల్ రోకో ఘటనకు సంబంధించి కవితతో పాటు మరో 12 మంది టీఆర్ఎస్ నాయకుల పైనా కేసులు నమోదయ్యాయి.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలో కవిత రైల్ రోకో చేశారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బీసీ బిల్లులకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమిస్తామని ఆ సందర్భంగా తేల్చి చెప్పారు.

Advertisement

Also Read: Best Printers 2026: మీ ఇంటికి కొత్త ప్రింటర్ కావాలా? ఈ టాప్ 5 మోడల్స్ చూడాల్సిందే!

Advertisement

అయితే కల్వకుంట్ల కవితతో పాటు టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన రైల్ రోకో కారణంగా సిర్నపల్లి – ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. అలాగే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూట్ లో ప్రయాణిస్తున్న మరో గూడ్స్ రైలును కొద్దిసేపు ఆపేయాల్సి వచ్చింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించిన కారణంగా కవితతో పాటు మరో 12 మంది నాయకులపై కామారెడ్డి రైల్వే ఏఎస్ఐ రవీంద్ర బాబు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కవితతో పాటు 12 మంది టీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశించింది.

Also Read: Air Conditioner: నీటి తుంపర్ల చిట్కా.. సగానికే పవర్ బిల్లు.. ఏసీ యూజర్లకు పండుగే!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×