Ajay Devgan : బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ (Ajay Devgan) గత కొంతకాలంగా వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా దృశ్యం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు’రైడ్ 2′ సినిమా చేసి మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.. ఇక నేటి నుంచి ఈ సినిమా కూడా ఓటీటీ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
“ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు” సినిమా చూపిస్తున్న అజయ్ దేవ్ గణ్
ఇలాంటి సమయంలో అజయ్ దేవ్ గణ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పబ్లిక్ లోనే ముద్దులు.. ఇంకా ఆమెపై ప్రేమ తగ్గలేదా? అని కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది “ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు” సీన్ రిపీట్ చేస్తున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
కాజోల్ సీరియస్ లుక్..
ప్రముఖ బాలీవుడ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న అజయ్ దేవ్ గణ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol )ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఈ జంట అన్యోన్యంగా కనిపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే అప్పుడప్పుడు కాజోల్ బహిరంగ సభలలో తన భర్త అజయ్ దేవ్ గణ్ పై సీరియస్ లుక్స్ ఇచ్చి దొరికిపోతూ ఉంటుంది . అలాగే మరొకవైపు అజయ్ దేవ్ గణ్ పై కూడా ఒక రూమర్ గట్టిగా వినిపిస్తోంది.
టబు ముద్దుల వర్షం..
ఈయనకు, హీరోయిన్ టబు (Tabu) కి మధ్య ఏదో తెలియని రిలేషన్ ఉందని, ఆయన సినిమాలో నటిస్తున్నారు అంటే కచ్చితంగా ఆ సినిమాలో ఆమె ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రమోషన్స్ లో వీరిద్దరి మధ్య ఉండే సాన్నిహిత్యం కూడా అలాగే ఉంటుంది. పబ్లిక్ లో ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటివి చూస్తే ఈ గాసిప్స్ కి మరింత బలం చేకూరుతోంది అని చెప్పవచ్చు.
వైరల్ గా మారిన వీడియో..
ఈ క్రమంలోనే ఒకవైపు కాజోల్ సీరియస్ లుక్ ఇచ్చిన వీడియోలు, ఇటు టబు ముద్దుల సన్నివేశాలు అన్నీ కలిపి ఒక వీడియో చేసి బాలీవుడ్ రివ్యూయర్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇంకేముంది ఇది చూసిన ప్రతి ఒక్కరూ పలు రకాల కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ వీడియో చూసిన కొంతమంది స్టోరీ బాగుంది కానీ ఇందులో నిజం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్నేహ బంధాన్ని తప్పుడు కోణంలో చూపిస్తున్నారా?
మరికొంతమంది టబు, అజయ్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ను ఇలా తప్పుడు కోణంలో చూడడం కరెక్ట్ కాదని కామెంట్ చేస్తున్నారు. గతంలో టబు కూడా తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఒక స్టార్ హీరో అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అతడి వల్లే తన పెళ్లికి దూరమయ్యాను అని చెప్పుకొచ్చింది. దీంతో నాడు టబు చెప్పిన ఆ స్టార్ హీరో ఇతనేనా? అందుకే పబ్లిక్ లో కూడా ఇలా చనువుగా ముద్దులు ఇచ్చుకుంటున్నారా? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Aadmi Kitna Khush and tension main Hota Hai, gharwali and Bahar Wali Ke Saath! Zara Dekh Leejiye! pic.twitter.com/JbHIXbGTlC
— KRK (@kamaalrkhan) June 25, 2025