BigTV English

American Airlines: గాల్లోనే విమానం ఇంజిన్‌లో మంటలు.. అప్రమత్తమైన పైలట్లు, వైరల్ వీడియో

American Airlines: గాల్లోనే విమానం ఇంజిన్‌లో మంటలు.. అప్రమత్తమైన పైలట్లు, వైరల్ వీడియో

American Airlines: అమెరికాలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో మంటలు రేగాయి. పరిస్థితి గమనించిన పైలట్లు చాకచక్యగా వ్యవహరించారు. లాస్ వేగాస్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊరిపిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.


అహ్మదాబాద్ ఘటన తర్వాత వివిధ దేశాలకు చెందిన విమానాలకు పలు సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే నిర్వాహణ లోపమా? అనేది కాసేపు పక్కనబెడితే ప్రయాణికులు విమానాలు ఎక్కడానికి భయపడుతున్నారు. తాజాగా అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం పెద్ద ప్రమాదం తప్పింది.

అమెరికా దేశ కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటలకు లాస్‌ వేగాస్‌లోని మెక్‌కారన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి 1665 నెంబరు గల విమానంవచ్చింది. అది నార్త్ కరోలినాలోని షార్లెట్‌కు బయలు దేరింది. విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాల లోపు దాని ఇంజిన్ నుంచి మంటలు, పొగలు రావడం మొదలైంది.


ఆ సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు ఉన్నారు. కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. పరిస్థితిని గమనించిన విమాన సిబ్బంది వెంటనే పైలట్లకు సమాచారం ఇచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని లాస్‌వేగాస్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

ALSO READ: విశాఖ మెట్రోకు అంతా రెడీ, తొలి స్టేషన్ ఎక్కడంటే

ఉదయం 8.20 గంటలకు సురక్షితంగా విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్టు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. విమానం సేఫ్‌గా అందులో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో 153 ప్రయాణికులతోపాటు 6 గురు సిబ్బంది ఉన్నారు.

ఘటన జరిగిన సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. విమానం గాల్లో ఉన్నప్పుడు సమీప పరిసరాల్లో ఉన్న వ్యక్తులు షూట్ చేశారు.

ఇంజిన్ నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చివరకు విమానం ల్యాండైన తర్వాత సాంకేతిక నిపుణులు తనిఖీలు చేశారు. ఇంజిన్ నుంచి మంటలు వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎయిర్‌లైన్ వర్గాలు తెలిపాయి.

 

Related News

Hydrogen Train: హైడ్రోజన్ రైలు వస్తోంది.. ఫస్ట్ సర్వీస్ అక్కడే.. వీడియో రిలీజ్ చేసిన రైల్వే మంత్రి!

Tax Relief: మీ పెంపుడు జంతువులను సింహాలకు ఆహారంగా ఇస్తే.. ట్యాక్స్ నుంచి ఉపశమనం!

Escalators at Mountains: ఏకంగా పర్వతాలకే ఎస్కలేటర్లు.. చైనా వాళ్లు మామూలోళ్లు కాదండోయ్!

Tirumala rules: తిరుమలకు వచ్చే వాహనాలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 15 నుండి కొత్త రూల్స్!

Free Wi-Fi: రైల్వే స్టేషన్ లో హ్యాపీగా వైఫై ఎంజాయ్ చెయ్యొచ్చు, సింపుల్ గా ఇలా చేస్తే చాలు!

Air India Flights: అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు బంద్, ప్రయాణీలకు అలర్ట్!

Big Stories

×