E-Paper
Advertisement

Psych siddhartha release: అఖండ 2 ఎఫెక్ట్.. కొత్త విడుదల తేదీని ప్రకటించిన నందు సైక్ సిద్ధార్థ్..

Psych siddhartha release: అఖండ 2 ఎఫెక్ట్.. కొత్త విడుదల తేదీని ప్రకటించిన నందు సైక్ సిద్ధార్థ్..
Advertisement

Psych siddhartha release : బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2(Akhanda 2) సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని పదకొండవ తేదీ ప్రీమియర్లు ప్రసారం కాబోతాయని చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. దీంతో చిన్న సినిమాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అఖండ 2 డిసెంబర్ ఐదవ తేదీ విడుదలవుతుందని చిన్న సినిమాలన్నీ డిసెంబర్ 12వ తేదీ విడుదలకు సిద్ధమయ్యాయి. కేవలం డిసెంబర్ 12వ తేదీ ఈషా,మోగ్లీ, సైక్ సిద్ధార్థ్, వంటి సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి.

జనవరి 1న సైక్ సిద్ధార్థ్..

ఈ క్రమంలోనే ఆఖండ 2 సినిమా 12వ తేదీ విడుదల కాబోతుందని చిత్ర నిర్మాతలు వెల్లడించడంతో చిన్న సినిమాలు ఒక్కొక్కటి 12వ తేదీ నుంచి వాయిదా పడుతూ కొత్త విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే శ్రీ నందు(Sree Nandu) హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం “సైక్ సిద్ధార్థ్”(Psych siddhartha). ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కావలసి ఉండగా అదే రోజు అఖండ2 సినిమా రాబోతున్న నేపథ్యంలో తమ సినిమాని వాయిదా వేసుకుంటున్నట్లు హీరో శ్రీనందు నటుడు రానా(Rana)తో కలిపి ఒక వీడియో షేర్ చేశారు.

బాలయ్య మీద ప్రేమతో..

Advertisement

ఈ వీడియోలో భాగంగా రానా నందు మధ్య సరదా సంభాషణ జరిగింది. అన్న ఒక మూడు రోజుల్లో మనం రాబోతున్నాము అంటూ నందు ఆతృతగా చెప్పడంతో వెంటనే రానా బాలయ్య వస్తున్నాడు కదా అంటూ చెబుతారు దీంతో కన్ఫామా అంటే అవును జై బాలయ్య అంటూ ఈ వీడియోని ముగించారు. అయితే బాలయ్య మీద ప్రేమతో తమ సినిమాని డిసెంబర్ 12వ తేదీ వాయిదా వేసుకుంటూ జనవరి ఒకటవ తేదీ విడుదల చేయబోతున్నామని ఈ వీడియో ద్వారా తెలియజేశారు. ఇక జనవరి ఒకటో తేదీ పెద్దగా సినిమాలు ఏవి విడుదల కానీ నేపథ్యంలో సరైన నిర్ణయం అంటూ ఈ సినిమా కొత్త విడుదల తేదీ పై అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాలో నందు హీరోగా నటించిన రానా సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం నందు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విభిన్నమైన కథతో సైక్ సిద్ధార్థ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడటం ఈ సినిమాతో పాటు మోగ్లీ డిసెంబర్ 12న వాయిదా పడి 13వ తేదీ విడుదల కాగా ఈషా సినిమా డిసెంబర్ 25వ తేదీ విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అఖండ 2 డిసెంబర్ 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయిందని చెప్పాలి.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×