Sara Tendulkar: సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడైనా కనిపిస్తే చాలు జనాలు ఎగబడిపోతుంటారు. వెంటనే వారిని చుట్టుముట్టేస్తారు. కుదిరితే వారితో సెల్ఫీలు దిగేందుకు.. లేదా తమ కెమెరాలలో వారి ఫోటోలు, వీడియోలు తీసేందుకు తెగ పరితపించిపోతుంటారు. కొన్ని కొన్ని సార్లు సమయం, సందర్భం లేకుండా ఫోటోలు, వీడియోలు తీయడం సోచనీయం. ఇలా కొంతమంది తీసే ఫోటోలు, వీడియోలు సెలబ్రిటీలను ఎంతో ఇబ్బందికి గురిచేస్తాయి. అయితే కొంతమంది సెలబ్రిటీలు వీటిని సాధారణంగా తీసుకుంటే.. మరి కొంతమంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు తాజాగా చాలా చోటు చేసుకుంటున్నాయి.
సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండూల్కర్, ప్రముఖ నటి, కమెడియన్.. కుషా కపిల తాజాగా బాంద్రాలోని ఓ రెస్టారెంట్ నుండి బయటకి వస్తున్న సమయంలో, అలాగే కారులో కూర్చున్న సమయంలో కొంతమంది తీసిన సారా టెండుల్కర్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సారా టెండూల్కర్ ని అసభ్యకర రీతిలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సారా టెండూల్కర్ కి సంబంధించిన ఈ వీడియోలు వైరల్ గా మారడంతో.. ఇలాంటి వాటిని వీడియో తీయాల్సిన అవసరం లేదని కొంతమంది మండిపడుతున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం.. ఇలాంటి దుస్తులు ధరించడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.
సారా టెండూల్కర్ వీడియో లాగే.. తాజాగా హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఓ రెస్టారెంట్ మెట్లు దిగివస్తుండగా కొంతమంది అసభ్యంగా ఫోటోలు, వీడియోలు తీశారు. ఇవి నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఈ వీడియోలపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు హార్దిక్ పాండ్యా. చీప్ సెన్సేషనలిజమ్ కోసం ఇలా దిగజారడం సరికాదని.. మహిళలను గౌరవించాలని హితువు పలికాడు.
ఇలాంటి ఫోటోలు, వీడియోలు తీసేటప్పుడు కాస్త మైండ్ ఫుల్ గా ప్రవర్తించాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు హార్దిక్ పాండ్యా. ప్రతిరోజు ఎంతో కష్టపడే మీడియా సోదరులు అంటే తనకు ఎంతో గౌరవం అని.. వారికి తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని అన్నాడు. కానీ ఇలాంటి విషయాల పట్ల కాస్త ఎక్కువగా శ్రద్ధ వహించాలని కోరాడు. ప్రతిదీ క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదని.. ప్రతి కోణాన్ని తీసుకోవలసిన అవసరం అంతకంటే లేదని చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఇలా రోజుకో సెలబ్రిటీ అసభ్యకర వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వారి అభిమానుల సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">