E-Paper
Advertisement

Akhanda 2 Collections : దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్..40 కోట్ల నష్టం తప్పదా..?

Akhanda 2 Collections : దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్..40 కోట్ల నష్టం తప్పదా..?
Advertisement

Akhanda 2 Collections : నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా బాలయ్య సినిమా అఖండ 2. ఇటీవలే థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా మొదలైనప్పటి నుంచి థియేటర్లలోకి వచ్చేవరకు భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది.. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ మూవీ కలెక్షన్స్ రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి. మౌత్ టాక్ కూడా మిక్సీ్డ్ ఉండటంతో సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది.. మొదటి రోజు నుంచి 6 రోజుల వరకు అఖండ 2 పరిస్థితి దారుణంగా పడిపోయింది.. కొన్ని ఏరియాల్లో సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా అవ్వలేదని టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసిందో ఒకసారి తెలుసుకుందాం..

అఖండ 2 6 రోజుల కలెక్షన్స్…

14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.. డిసెంబర్ 12 న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బిజినెస్ కూడా బాగానే జరిగింది. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే 104 కోట్ల రూపాయల షేర్, 208 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.. కానీ ఇది అంత రీచ్ అవ్వడం కష్టమని అనిపిస్తుంది. మొదటి రోజు 22.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 15.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 15.1 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 5.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 4.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది.. అలాగే ఆరో రోజు కూడా 3 కోట్లకు వసూళ్లను అందుకుందని తెలుస్తుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 40 కోట్లు రాబట్టాల్సి ఉంది.. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అంత రాబట్టడం కష్టమని అనిపిస్తుంది.

Advertisement

Also Read :గాయత్రిని ఆడుకున్న చక్రి.. డ్రైవర్ గా జాయిన్ అయిన చక్రి..మహా మాటతో హారిక షాక్..

ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో సున్నా ఓపెనింగ్స్…

ఒంగోలు లో నందమూరి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. కానీ అక్కడ కూడా పెద్దగా కలెక్షన్స్ రాలేదని తెలుస్తుంది.. అదే విధంగా కోస్తా జిల్లాల్లో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని తెలుస్తుంది. ఉభయ గోదావరి జిల్లా ల్లో ఈ చిత్రానికి నిన్న, మొన్న నెగిటివ్ షేర్స్ నమోదు అయ్యాయి. అక్కడ దాదాపు సున్నా కంటే తక్కువ.. కృష్ణా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా రెంటల్ బేసిస్ మీద ఈ సినిమాని రన్ చేస్తే కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కలేదు.. ఐదో రోజు కాస్త మెరుగ్గా ఉన్న కలెక్షన్స్ ఆరో రోజు మాత్రం దారుణంగా పడిపోయినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎటు చూసినా కూడా.. అక్కడ టు కలెక్షన్స్ ఘోరంగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటివారం ఈ సినిమాకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. మరి రెండోవ వారమైన కలెక్షన్లు పెరుగుతాయి ఏమో చూడాలి..

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×