E-Paper
Advertisement

Podarillu Today Episode : గాయత్రిని ఆడుకున్న చక్రి.. డ్రైవర్ గా జాయిన్ అయిన చక్రి..మహా మాటతో హారిక షాక్..

Podarillu Today Episode : గాయత్రిని ఆడుకున్న చక్రి.. డ్రైవర్ గా జాయిన్ అయిన చక్రి..మహా మాటతో హారిక షాక్..
Advertisement

Podarillu Today Episode December 18th: ఇంటికి చిన్న చిన్న మరమ్మతులు చేస్తే సరిపోతుంది అని అంటారు.. భూషణ్ కారు చక్రీ కారును ఢీ కొడుతుంది.. ఏంట్రా ఇడియట్ అసలు రోడ్డు కనిపించట్లేదా నీకు కళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావు అని తిడతాడు. చక్రి మాటకు మాట సమాధానం చెప్తాడు.. కారులో ఉన్న మహా ఈ గొడవేంటి అని బయటకు వస్తుంది. చక్రి ఆమెను చూసి నా అదృష్టదేవత ఇక్కడ ఉందా అని సంతోషపడతాడు.. తప్పు మన వైపే ఉంది కాబట్టి మనమే క్షమాపణ చెప్పాలి అని మహా అంటుంది.. ఇండియాలో కొన్ని రూల్స్ ఉంటాయి వాటి ప్రకారమే ఫాలో అవ్వాలని మహా చక్రికి సపోర్ట్ గా మాట్లాడుతుంది. మహా వల్ల గొడవ ఆగిపోతుంది.  ఇంటికి మరమ్మతులు చేయాలని నారాయణ కుటుంబం అనుకుంటుంది.. గాయత్రి వాళ్ళ ఫ్రెండ్ గాయత్రి దగ్గరకొచ్చి మీ బావ వాళ్ళ ఇంటికి మరమ్మతలు చేస్తున్నారంట నీకు తెలియదా ఈ విషయం అని అడుగుతుంది. ఈ సంబంధం ఎలాగైనా చెడిపోవాలి అని గాయత్రి అంటుంది.  మొత్తానికి గాయత్రి అనుకున్న ప్లాన్ ప్రకారం ఇంటి మరమ్మతులు చేయకుండా ఆపేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. గాయత్రి రాత్రి ఇంటికి వస్తుంది. ఏంటి నువ్వు ఇంటికి వచ్చేసావు మీ అమ్మ చూస్తే ఏమంటుంది అని చక్రి అడుగుతాడు. మా అమ్మ ఏమనుకుంటుందో ఏమో నాకేం తెలుసు అని గాయత్రి అంటుంది. నువ్వు మీ అమ్మతో చెప్పి పెళ్లికి ఒప్పించొచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటుంది. మా అమ్మ సంగతి తెలిసి కూడా నువ్విలా మాట్లాడుతున్నావా అని గాయత్రి అంటుంది. ఇంకేం చేయాలి మరి ? మీ అన్న ఇప్పట్లో పెళ్లి చేసుకునేలాగా కనిపించట్లేదు అని గాయత్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఇక పెళ్లి వాళ్లకి సంబంధం ఓకే అయింది ఎలాగైనా సరే ఒప్పించేస్తే బాగుంటుంది అని అనుకుంటారు..

Advertisement

ఉదయం భూషణ్ ఇండియాలో డ్రైవర్ల గురించి దారుణంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు నేను చూశారు కదా వాడు ఎలా మాట్లాడాడో అని అంటూ ఉంటాడు.. అంతేకాదు ఇండియాలో ఉండాలంటే నాకు చెడ్డ చిరాకు మా అమ్మ నాన్న కూడా అక్కడికి రమ్మని చెప్తే లేదు ఇక్కడే ఉంటామని అంటున్నారు అక్కడికి వెళ్తే ఇంకో వచ్చే పని ఉండదు అని భూషణ్ అంటాడు.. అప్పుడే ప్రతాప్ ఆది కి ఫోన్ చేస్తాడు. ఎదురుగా అల్లుడు ఉన్నాడా అలా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఇక తర్వాత భూషణ్ తో మాట్లాడిన ప్రతాప్ మీకు ఇండియాలో ఉన్నన్ని రోజులు మంచి డ్రైవర్ ని పంపించమని ఏజెన్సీని అడిగాను.. వాళ్లు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని మీకోసం పంపిస్తామని చెప్పారు అని అంటాడు.. మీరు చెప్పారంటే కచ్చితంగా మంచి వాడే అయ్యుంటాడు అంకుల్ అని భూషణ్ అంటాడు.. ఆ తర్వాత భూషణ్ డ్రైవర్ గురించి దారుణంగా మాట్లాడుతూ ఉంటాడు. చూశారా ఎలా మాట్లాడాడో అని అనగానే ఇప్పటికీ చూస్తూ ఉన్నాను అని ఆది అంటాడు..

ఇప్పుడెలా చూస్తున్నారు అని భూషణ్ ఎదురుగా చూడగానే చక్రి లోపల ఉంటాడు.. మీకు డ్రైవర్ కావాలని చెప్పారట ఏజెన్సీ వాళ్ళు నన్ను పంపించారు అని అంటాడు.. నిన్న నన్ను అన్ని మాట్లాడినా ఇవాళ నా ఇంటికి వచ్చే నన్ను టార్గెట్ చేస్తున్నావా..? నీకు ఏం చేయాలో అది చేస్తాను అని అంటాడు. అయితే ఈ జుట్టు పోలిగాడు ఇక్కడ ఉన్నాడు అంటే కచ్చితంగా ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు.. మహా హారిక ఇద్దరు షాపింగ్ టైం అయింది రండి అనేసి భూషణ్ వాళ్ళ అమ్మ పిలుస్తుంది. ఆ మాట వినగానే ఇద్దరు కిందకు వస్తారు. అక్కడ డ్రైవర్ తో వాదులాడుతూ కనిపిస్తాడు భూషణ్..

Advertisement

ఈ అమ్మాయి ఎక్కడుందంటే కచ్చితంగా నేను ఇక్కడే ఉద్యోగంలో ఎలాగైనా జాయిన్ అవ్వాలి అని చక్రి అనుకుంటాడు. ఇక్కడే ఉంటే ఈ అమ్మాయి మనసులో చోటు దక్కించుకుంటాను అని చక్రి అనుకుంటాడు.. నిన్న జరిగిందానికి ఇవాళ నేను క్షమాపణ చెప్తున్నాను సార్ అని చక్రి అంటాడు. నిన్న ఏం జరిగిందో అన్నది నేను చెప్తాను నేను రైట్ రూట్ లో వచ్చాను మీరు రాంగ్ రూట్లో వస్తుండగా నేనే వెళ్లి మిమ్మల్ని గుద్దేసాను అని చక్రి అంటాడు. మిమ్మల్ని చూస్తుంటే హిమాలయాల్లో ఉండే ఋషుల్లాగా ఉన్నారు అని అంటాడు. నీదే తప్పు అని అంటున్నావు కదా సరే జాయిన్ అవ్వు అని భూషణ్ అంటాడు.

ఆది మీ చెల్లెలు ఏమంటుంది ఇప్పుడు అతని తప్పు ఒప్పుకున్నాడు కదా అని భూషణ్ అంటాడు.. ఆ తర్వాత మహా కోపంగా ఉంటుంది. మీ అత్తయ్య గారు పిలుస్తున్నారు కిందకు రమ్మని రా వెళ్దాం కాస్త నవ్వుతూ రా అనేసి అంటుంది.. మహా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంది. మీ అన్నయ్యకు నీకు మధ్యలో నేను క్రష్ అయిపోతున్నాను నావల్ల కావడం లేదు అని హారిక అంటుంది.. తర్వాత కిందకు రాగానే భూషణ్ దోస ని ఫోర్క్ తో తింటూ ఉంటాడు.. దానికి పెద్ద క్లాస్ చెప్తాడు. మహా మాత్రం మనసులో వాడిని తిట్టుకుంటూ ఉంటుంది.

Also Read :అయ్యో.. శ్రీవల్లి ఇలా ఇరుక్కుందేంటి..? భాగ్యం కు కొత్త టెన్షన్.. సాగర్ కు క్లాస్..

కేశవ కన్నా ఇద్దరు కూడా ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు.. పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచితే బాగుంటుంది అని అనుకుంటారు.. కేశవ వెళ్లి కుర్చీలను పట్టుకుని వస్తాడు.. అంత సిద్ధం చేయగానే పెళ్లి వాళ్ళు ఇంట్లోకి వస్తారు.. ఇంటిని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత నారాయణ చెప్పింది విని కాస్త కన్విన్స్ అవుతారు. మాధవ్ మాత్రం అంత నిజమే చెప్పాలి అని అనుకుంటారు. పెళ్లి వాళ్ళని చూసినా గాయత్రి పెళ్లి ఓకే అయిపోతుంది ఏమో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కన్నా గాయత్రి తో మాట్లాడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మహా చీరల సెలక్షన్ లో భూషణ్ ని ఆడుకుంటుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Big Stories

Advertisement
×