E-Paper
Advertisement

Akhanda 2 : అఖండ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే, ఆ సినిమాల పరిస్థితి ఏంటో

Akhanda 2 : అఖండ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే, ఆ సినిమాల పరిస్థితి ఏంటో
Advertisement

Akhanda 2 Release Date: భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. బోయపాటి శ్రీనుకి సింహా సినిమా విపరీతమైన పేరు తీసుకొచ్చింది. అక్కడితో మొదలైన వీరి కాంబినేషన్ మూడు సక్సెస్ఫుల్ సినిమాలను చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు అఖండ 2 సినిమా సినిమా రాబోతుంది. ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించారు.

Advertisement

కానీ చివరి నిమిషంలో ఉన్న కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ సినిమా వాయిదా పడిపోయింది. ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్లు మొదలవుతాయి అనుకునే టైంలో సినిమా వాయిదాలు పడటం అనేది రేర్ గా జరుగుతుంది. అయితే అది బాలకృష్ణ వంటి సీనియర్ హీరోకి జరగడం అనేది ఊహించని పరిణామం. ఇకపోతే ఈ సినిమా విషయంలో ఇప్పటికీ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే క్లారిటీ లేదు. కానీ వినిపిస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేసారు.

అఖండ 2 రిలీజ్ అయ్యేటప్పుడు అప్పుడే

ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 11వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పలుచోట్ల పడనున్నాయి. దాదాపు ఈ సినిమాకి సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ఈ తరుణంలో 12వ తారీకు ప్రేక్షకులు ముందుకు రావడానికి కొన్ని సినిమాలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అఖండ సినిమా వస్తుంది కాబట్టి వాటి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఎందుకంటే క్రిస్మస్ కానుకగా కూడా కొన్ని సినిమాలను అనౌన్స్ చేశారు. ఆ తర్వాత పండగ సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ సినిమాలు సరైన రిలీజ్ డేట్ కు నోచుకోకుండా పోతాయి.

సరైన రిలీజ్ డేట్ అవసరం

Advertisement

కొన్ని సందర్భాల్లో ఒక మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాను సరైన డేటుకు రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. చాలా సినిమాలు సరైన రిలీజ్ డేట్ దొరక్క పోవడం వల్లనే ఊహించిన సక్సెస్ ను సాధించలేవు. అయితే అఖండ రిలీజ్ డేట్ గురించి ఇప్పటికి అధికారిక ప్రకటన రాలేదు కొద్దిసేపట్లో ఈ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. బాలకృష్ణ కెరియర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ చేసిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లోనే ప్రమోట్ చేశారు. ఈ సినిమాలో ఎక్కువగా సనాతన ధర్మం గురించి చూపించబోతున్నట్లు వీడియో కంటెంట్ చూస్తే అర్థమవుతుంది.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×