E-Paper
Advertisement

Akhanda 2 : బాలయ్యకు షాక్ ఇచ్చిన ఆడియన్స్.. అఖండ2కు రెస్పాన్స్ తగ్గడానికి కారణాలు ఇవే..

Akhanda 2 : బాలయ్యకు షాక్ ఇచ్చిన ఆడియన్స్.. అఖండ2కు రెస్పాన్స్ తగ్గడానికి కారణాలు ఇవే..
Advertisement

Akhanda 2: నందమూరి అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న బాలయ్య అఖండ 2 మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. నిన్న ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది.. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ అఖండ కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది.. డిసెంబర్ 5 న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. మొత్తానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది.. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సరే.. అఖండ 2 కు గండాలు వీడలేదు.. ముందు విడుదలకు అడ్డంకి ఏర్పడింది.. ఇప్పుడేమో ఆడియన్స్ వల్ల పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమాకు థియేటర్లలో రెస్పాన్స్ దారుణంగా ఉందని తెలుస్తుంది.. అఖండ 2 కు రెస్పాన్స్ తగ్గడానికి ముఖ్యకారణాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..

బాలయ్య సినిమాకు తగ్గిన రెస్పాన్స్..

నందమూరి హీరో బాలయ్య సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయంటే ఆ హంగామా వేరే లెవెల్ లో ఉంటుంది.. ఆయన అభిమానులతో పాటుగా, సినీ అభిమానులు సైతం సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గతంలో వచ్చిన ప్రతి సినిమాకు మొదటి రోజు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ అఖండ 2 పరిస్థితి దారుణంగా మారింది. నిజానికి మొదటి రోజు రెస్పాన్స్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. అందులో ఒకటి ఏ తేదీన సినిమా రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకపోవడం.. డిసెంబర్ 5 న వాయిదా పడిన తర్వాత సినిమా విడుదల తేదీ గురించి జనాలకు క్లారిటీ లేదు. దానివల్ల సినిమా థియేటర్లలోకి వచ్చిందని తెలియలేదు. మరొకటి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చలి తీవ్రత. దీనివల్ల ప్రీమియర్ షోలకు, మార్నింగ్ షోలకు జనాలు ఎక్కువగా రాలేకపోయారు. దాంతో నిన్న ప్రీమియర్స్ షోకు థియేటర్లు చాలా చోట్ల ఖాళీగానే ఉన్నట్లు సమాచారం. ఈ రెండు కారణాల వల్ల అఖండ 2 ఫస్ట్ కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఈ వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరగాలి.. వీకెండ్ ఈ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం పెరుగుతాయో చూడాలి..

Advertisement

Also Read :మహాకు షాకిచ్చిన పెళ్ళికొడుకు.. పెళ్లిచూపుల్లో గారెలు వేసిన మాధవ్..ఈ పెళ్లి క్యాన్సిలా..?

అఖండ 2 బ్రేక్ ఈవెన్ అవుతుందా..? 

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు వచ్చిన నాలుగవ సినిమా కూడా అంతకుమించి వసూళ్లను రాబడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాను ముందుగా అనుకున్న డేట్ కు రాకపోవడంతో చాలామంది అభిమానులు నిరాశ పడ్డారు. ఇవాళ థియేటర్లలోకి సినిమా వచ్చినా సరే.. ఈ డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎక్కువ మంది సినిమాను మొదటి రోజు చూడలేకపోయారు.. దాంతో మొదటి రోజు 55 కోట్లు వసూలు చేస్తుందనే అంచనా తప్పేలా ఉంది. చాలా వరకు థియేటర్లు మొదటి రోజే ఖాళీగా ఉండడంతో నందమూరి అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మొదటిరోజు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని రీచ్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు.. అయితే ఈ వీకెండ్ సినిమాకు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. మరి మొదటివారం ఏ మాత్రం కలెక్షన్స్ పెరుగుతాయో చూడాలి..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×