E-Paper
Advertisement

Vastu Tips: వ్యాపారంలో నష్టపోతున్నారా ? ఈ వాస్తు మార్పులు చేయాల్సిందే !

Vastu Tips: వ్యాపారంలో నష్టపోతున్నారా ? ఈ వాస్తు మార్పులు చేయాల్సిందే !
Advertisement

Vastu Tips: ఏ వ్యాపారానికైనా లాభాలు, నష్టాలు సహజమే అయినప్పటికీ.. నిరంతరం నష్టాలను ఎదుర్కొంటుంటే లేదా వ్యాపారం అనుకున్నంత వేగంగా వృద్ధి చెందకపోతే.. మీ ఆఫీసు లేదా దుకాణంలో ఉన్న వాస్తు దోషాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఆఫీస్‌లోని సరైన దిశలు, రంగులు, వస్తువుల అమరిక సానుకూల శక్తిని, ఆర్థిక శ్రేయస్సును ఆకర్షిస్తాయి. మీరు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటుంటే.. వెంటనే మార్చాల్సిన 7 కీలక వాస్తు మార్పులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆగ్నేయ దిశ:
ఆగ్నేయ దిశ అగ్ని మూలకానికి.. నగదు చలామణికి సంబంధించింది. ఈ దిశలో నీలం రంగు, నీరు లేదా భారీ వస్తువులు ఉంటే.. అది నగదు ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.

Advertisement

పరిష్కారం: ఈ దిశలో ఆకుపచ్చ రంగు మొక్కలు, ఎరుపు లేదా మెరూన్ రంగు వస్తువులు ఉంచండి. ఈ దిశలో ఒక చిన్న ఎర్రటి బల్బును వెలిగించడం వల్ల నగదు ప్రవాహం వేగవంతమవుతుంది.

2. ఉత్తర దిశను ఉత్తేజపరచండి:
ఉత్తర దిశ కుబేరుడికి (సంపద దేవుడు), కొత్త అవకాశాలకు ప్రతీక. ఈ దిశలో ఎరుపు, పసుపు, లేదా గోధుమ రంగు వస్తువులు ఉంటే కొత్త అవకాశాలు ఆగిపోతాయి.

Advertisement

పరిష్కారం: ఉత్తర దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. నీలం లేదా ఆకుపచ్చ వస్తువులను ఉంచండి. నీరు (ఉదాహరణకు చిన్న వాటర్ ఫౌంటెన్) లేదా మీ ఆదాయానికి సంబంధించిన పత్రాలను ఈ దిశలో ఉంచడం వల్ల అవకాశాలు పెరుగుతాయి.

3. క్యాషియర్ సీటు:
క్యాషియర్ లేదా నగదును నిర్వహించే వ్యక్తి ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశకు ముఖం చేసి కూర్చోవాలి. ఈ దిశలు డబ్బును, వృద్ధిని ఆకర్షిస్తాయి.

4. ప్రధాన ద్వారం:
వ్యాపార సంస్థ ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా.. ప్రకాశవంతంగా ఉండాలి. ప్రధాన ద్వారం ముందు ఎలాంటి చెత్త కుండీలు లేదా అడ్డంకులు ఉండకూడదు. ప్రధాన ద్వారం ఉత్తరం, ఈశాన్యం, లేదా తూర్పు దిశలో ఉండటం అత్యంత శుభప్రదం.

5. యజమాని కూర్చునే స్థానం:
వ్యాపార యజమాని కార్యాలయంలోని నైరుతి దిశలో, తూర్పు లేదా ఉత్తరం దిశకు ముఖం చేసి కూర్చోవాలి. ఈ స్థానం నాయకత్వం, స్థిరత్వం , నిర్ణయాలు తీసుకోవడానికి శక్తిని ఇస్తుంది. యజమాని వెనుక దృఢమైన గోడ ఉండాలి. ఇది మద్దతు, విశ్వాసాన్ని సూచిస్తుంది.

Also Read: ఈ స్క్రబ్‌లు వాడితే.. గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ !

6. వస్తువుల నిల్వ :
మీరు అమ్మకానికి ఉంచిన వస్తువులను లేదా స్టాక్‌ను వాయువ్యం లేదా దక్షిణ దిశలలో నిల్వ చేయాలి. ఈ దిశలలో నిల్వ చేసిన వస్తువులు త్వరగా అమ్ముడవుతాయని వాస్తు చెబుతోంది.

7. ఈశాన్య మూల :
ఈశాన్య మూల (దేవుని మూల) ఎప్పుడూ శుభ్రంగా.. ఖాళీగా, ప్రశాంతంగా ఉండాలి. ఈ స్థలంలో ఎలాంటి చెత్త, బరువు లేదా బాత్రూమ్ ఉండకూడదు. ఇక్కడ ప్రశాంతమైన నీటి బుడగ లేదా ఆధ్యాత్మిక చిహ్నాలను ఉంచడం శుభకరం

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×