E-Paper
Advertisement

Lenin First Single:  ‘వవారెవ్వా..వారెవ్వా’ అదిరిపోయిన అఖిల్ ఫస్ట్ సింగిల్ ప్రోమో..

Lenin First Single:  ‘వవారెవ్వా..వారెవ్వా’ అదిరిపోయిన అఖిల్ ఫస్ట్ సింగిల్ ప్రోమో..
Advertisement

Lenin First Single: అక్కినేని అభిమానులు గత కొద్ది రోజులుగా అఖిల్ నటించిన లెనిన్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాని ఈ ఏడాది మార్చి నెలలో విడుదల చేయబోతున్నట్టు ఇటీవల నిర్మాత నాగ వంశీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తుంది. కేవలం భాగ్యశ్రీపై చిత్రీకరించాల్సిన కొన్ని సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నట్టు సమాచారం. ఇక షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇదివరకే భాగ్యశ్రీ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

‘ హే ఇన్నావా.. ఇన్నావా’ ..

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ‘ హే ఇన్నావా.. ఇన్నావా’ అంటూ సాగిపోయే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే అచ్చం పల్లెటూరి వాతావరణంలో ఈ పాట ఉండబోతుందని తెలుస్తుంది. ఇక భాగ్యశ్రీ,, అఖిల్ సైతం పల్లెటూరి అబ్బాయి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఫుల్ లిరికల్ సాంగ్ ను జనవరి 5వ తేదీ విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. లెనిన్ సినిమా కోసం అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు .అఖిల్ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సినిమాతో కూడా హిట్ అందుకోలేకపోయారు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్..

Advertisement

ఈ నేపథ్యంలోనే సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగ వంశీ నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా రాయలసీమ లవ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ భారతి అనే పాత్రలో కనిపించబోతున్నారు. నిజానికి భారతి పాత్ర కోసం చిత్ర బృందం ముందుగా నటి శ్రీ లీలను ఎంపిక చేశారు.

Advertisement

కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకోవడంతో తిరిగి భాగ్యశ్రీ ను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తోంది . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అఖిల్ సినిమాని కూడా మార్చి నెలలోనే పోటీకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా విడుదల తేదీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. ఇక ఈ సినిమా విషయంలో నాగార్జున స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ఎలాంటి తప్పులు దొర్లకుండా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి అఖిల్ కు సక్సెస్ ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

Also Read: Ashish vidyarthi Injured: ప్రమాదానికి గురైన నటుడు ఆశిష్ విద్యార్థి.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×