E-Paper
Advertisement

Prabhas remuneration: రాజా సాబ్ సినిమా వల్ల ప్రభాస్ కి 50 కోట్లు నష్టమా?

Prabhas remuneration: రాజా సాబ్ సినిమా వల్ల ప్రభాస్ కి 50 కోట్లు నష్టమా?
Advertisement

Prabhas  remuneration: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా మీద అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ఫాంటసీ హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతోంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ, ఎమోషన్, హై వోల్టేజ్ డ్రామా అన్నీ కలిపి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతోందని టాక్.
ఈ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏంటంటే… ప్రభాస్ ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నారట.

ప్రతి సినిమాకు దాదాపు రూ.150 కోట్ల వరకు ప్రభాస్ పారితోషికం తీసుకుంటారని ఇండస్ట్రీలో ఓ అంచనా ఉంది. కానీ ది రాజా సాబ్ సినిమా కోసం ఆయన కేవలం రూ.100 కోట్లకే ఓకే చెప్పారని సమాచారం. అంటే దాదాపు రూ.50 కోట్ల త్యాగం చేసినట్టే లెక్క. ఇంత భారీ బడ్జెట్ సినిమా కోసం ప్రభాస్ ఇలా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అనేది ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. కానీ సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు రూ.500 కోట్ల వరకు ఉండటంతో, ప్రొడక్షన్ క్వాలిటీపై ఎక్కడా రాజీ పడకూడదన్న ఉద్దేశంతో ప్రభాస్ ఈ స్టెప్ తీసుకున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాలో ఇతర నటీనటుల పారితోషికాల విషయానికి వస్తే సంజయ్ దత్ ఈ సినిమాలో ఒక దెయ్యం పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయనకు రూ.5 నుంచి 6 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. హీరోయిన్స్ విషయానికి వస్తే, మాళవిక మోహనన్‌కు దాదాపు రూ.2 కోట్లు, నిధి అగర్వాల్‌కు రూ.1.2 నుంచి 1.5 కోట్ల వరకు, రిద్ధి కుమార్‌ ది ముఖ్యమైన పాత్ర కాబట్టి దాదాపు రూ.3 కోట్లు ఇచ్చారట.
డైరెక్టర్ మారుతికి కూడా ఈ సినిమా కోసం మంచి రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. మారుతి కి దాదాపు రూ.18 కోట్ల వరకు పారితోషికం అందినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఒక హారర ఫాంటసీ కథకు బలమైన ఎమోషనల్ పాయింట్ కూడా జత అయితే ఎలా ఉంటుందో సినిమా అలానే ఉంటుందట. ఇప్పటికే ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చింది. రన్‌టైమ్ మూడు గంటలకు పైగానే ఉండటం కొంత నిరాశ కలిగించే అవకాశం ఉంది. మ్యూజిక్ విషయానికి వస్తే ఎస్.ఎస్. థమన్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలవబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘సహాన సహాన’ పాట మిలియన్ల వ్యూస్‌తో వైరల్ అయింది.

Advertisement

ట్రైలర్‌లో వినిపించిన థమన్ బీజీఎం సినిమాపై అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఇక సీనియర్ నటి జరినా వహాబ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఆమెనే ఈ సినిమాకు నిజమైన హీరోయిన్ అని ప్రభాస్ చెప్పడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఆమె పారితోషికం వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

ALSO READ: Prabhas Herione: ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రభాస్ ప్రియురాలి చెల్లి… ఇన్‌‌స్టాలో రొమాంటిక్ ఫోటోలు వైరల్

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×