E-Paper
Advertisement

తండ్రికేమో రూ.2500 కోట్ల ఆస్తి.. నెలకు రూ.4500 జీతంతో పల్లెటూరి జీవితం గడుపుతున్న స్టార్ కిడ్.. ఎవరంటే?

తండ్రికేమో రూ.2500 కోట్ల ఆస్తి.. నెలకు రూ.4500 జీతంతో పల్లెటూరి జీవితం గడుపుతున్న స్టార్ కిడ్..  ఎవరంటే?
Advertisement

Film industry: సినిమా సెలబ్రిటీల వారసులు ఏ రేంజ్ లో లగ్జరీ జీవితాన్ని గడుపుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోల్డెన్ స్పూన్ తో పుట్టే ఈ పిల్లలు పుట్టిన దగ్గరి నుంచి తిరిగి వారి కెరియర్ ను బిల్డ్ చేసుకునే వరకు తల్లిదండ్రుల తోడ్పాటు ఎంతో ఉంటుంది. వేలకోట్ల ఆస్తులు అనుభవించడానికి పిల్లలే కదా అర్హులు అనే రేంజ్ లో తల్లిదండ్రులు కూడా ఆస్తులను భారీగా పిల్లలకే కేటాయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక స్టార్ కిడ్ మాత్రం తండ్రికి 2,500 కోట్ల ఆస్తి ఉంది. కానీ తాను మాత్రం స్వతంత్రంగా నిలబడడం కోసం 15 సంవత్సరాలకే ఇంటి నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా బతకడం మొదలుపెట్టాడు.. గ్రామీణ ప్రాంతాల్లో జీవనాన్ని కొనసాగిస్తూ నెలకు 4,500 జీతాన్ని అందుకుంటూ ఒక సామాన్య వ్యక్తిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక వారు ఎవరు ? ఎందుకు ఇలా చేస్తున్నారు? అనే విషయాలు తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయక మానదు . ఆ తండ్రి తన కొడుకు స్వతంత్ర జీవనాన్ని గర్వంగా చెప్పుకుంటూ అందరిని ఆశ్చర్యపరిచారు.

తండ్రికి వేలకోట్ల.. సామాన్య జీవితం గడుపుతున్న కొడుకు..

ఆ స్టార్ హీరో ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బడా హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఒకవైపు హీరోగా, మరొకవైపు విలన్ గా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈయన తాజాగా భూత్ బంగ్లా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ఎప్పటిలాగే తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించేశారు. ఇక ఇందులోని నటీనటులు తమ పాత్రలకు ప్రాణం పోశారని చెప్పాలి. ఒకవైపు తన సినిమా సక్సెస్ తో ఖుషీ అవుతున్న అక్షయ్ కుమార్.. మరొకవైపు తన కొడుకు గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఆరవ్ జీవితంపై అక్షయ్ కుమార్ కామెంట్..

Advertisement

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా వారసుడైన ఆరవ్ కుమార్.. అందరి సినిమా సెలబ్రిటీల పిల్లలాగే సినిమాల్లోకి రాకుండా.. యుక్తవయసులోనే చదువును కొనసాగించడానికి లండన్ కి వెళ్ళిన ఆరవ్ అప్పటి నుండే వంట చేసుకోవడం, తన నివాసాన్ని చక్కగా ఉంచుకోవడం వంటి రోజూ వారి బాధ్యతలను నిర్వహిస్తూనే.. స్వతంత్రంగా జీవించడం మొదలుపెట్టారట. అందులో భాగంగానే ఫ్యాషన్ డిజైనింగ్ పై దృష్టి సారించిన ఆరవ్ స్థానిక సాంప్రదాయాల నుండి ముఖ్యంగా దేశీ అవసరాలు, గ్రామ కళలను నేర్చుకోవడానికి నేరుగా గ్రామాలకే వెళ్తూ ఫ్యాషన్ డిజైన్ లో శిక్షణ పొందుతున్నాడు .

మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యుడు..

ఇక అంతేకాదు మార్షల్ ఆర్ట్స్ లో విస్తృతంగా శిక్షణ కూడా పొందాడు. కుడో లో బ్లాక్ బెల్ట్ సాధించి, జూడోలో గుర్తింపు పొందాడు. నిజానికి ఒక ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ హంగులు, ఆర్భాటాలకు వెళ్లకుండా క్రమశిక్షణ ఆత్మవిశ్వాసానికి ప్రాధాన్యతనిస్తూ నిశ్శబ్దంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవడానికి కష్టపడుతున్నాడు.

Advertisement

also read:బిగ్ బాస్ కి నోటీసులు.. 2 కోట్లు ఇవ్వాల్సిందే – ప్రముఖ నటి

గ్రామీణ ప్రాంతాల్లో జీవనం.. నెలకు 4,500 సంపాదన..

ఇక అందులో భాగంగానే తండ్రి సంపాదనను ఏమాత్రం వినియోగించుకోకుండా సొంతంగా కష్టపడుతూ పల్లెటూర్లలో ఉద్యోగం చేస్తూ నెలకు రూ.4500 సంపాదిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా పల్లెటూర్లకు వెళ్లి అక్కడి నుంచే ఫ్యాషన్ నేర్చుకుంటున్నాడు. వివిధ రకాల ప్రింట్ ఇతర విషయాలను నేరుగా అర్థం చేసుకుంటూ తన కెరియర్ను బిల్డ్ చేసుకుంటున్నాడు ఆరవ్ కుమార్. ఏది ఏమైనా తండ్రికి రూ.2500 కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ కొడుకు మాత్రం కష్టపడుతూ నెలకు రూ.4500 సంపాదనతో జీవితాన్ని కొనసాగించడం నిజంగా గొప్ప విషయం అంటూ ఆరవ్ కుమార్ పై నెటిజన్లు, అక్షయ్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

Big Stories

Advertisement
×