E-Paper
Advertisement

శరీరాన్ని క్లీన్ చేసే డిటాక్స్ వాటర్.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

శరీరాన్ని క్లీన్ చేసే డిటాక్స్ వాటర్.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Advertisement

Detox Water: ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో ‘డిటాక్స్ వాటర్’ అనేది ఒక పెద్ద హెల్త్ ట్రెండ్‌గా మారింది. పండ్లు, కూరగాయలు లేదా మూలికలను నీటిలో నానబెట్టి తయారుచేసే ఈ డ్రింక్ శరీరాన్ని శుభ్రపరుస్తుందని, బరువు తగ్గిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే.. ఇది కేవలం మంచినీరు తాగే ఒక రుచికరమైన మార్గమా లేదా నిజంగానే అద్భుతాలు చేస్తుందా? దీని వెనక ఉన్న శాస్త్రీయ నిజాలు, ప్రచారంలో ఉన్న అపోహల గురించి వివరంగా
ఇప్పుడు తెలుసుకుందాం.

డిటాక్స్ వాటర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

Advertisement

డిటాక్స్ వాటర్ తాగడం వల్ల నేరుగా కాకపోయినా.. పరోక్షంగా శరీరానికి అనేక లాభాలు చేకూరుతాయి.

1. హైడ్రేషన్ పెంచుతుంది :
చాలా మందికి సాధారణ నీరు తాగడం బోరింగ్‌గా అనిపిస్తుంది. పండ్లు లేదా పుదీనా కలిపిన నీరు మంచి రుచిని ఇస్తుంది.దీని వల్ల ప్రజలు ఎక్కువ నీరు తాగుతారు.సరైన మోతాదులో నీరు తాగడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

Advertisement

2.జీర్ణక్రియ మెరుగుపడుతుంది :
జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి నీరు చాలా అవసరం. నిమ్మకాయ, అల్లం వంటివి కలిపిన డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అంతే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

3. మెరిసే చర్మం :
శరీరంలో టాక్సిన్స్ (వ్యర్థాలు) పేరుకుపోవడం వల్ల చర్మం నిస్తేజంగా మారుతుంది. డిటాక్స్ వాటర్ ద్వారా శరీరానికి తగినంత నీరు అందడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. మొటిమలు తగ్గి ముఖం తాజాగా మారుతుంది.

4. రోగనిరోధక శక్తి :
నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లను వాడటం వల్ల శరీరానికి కొంత మేర విటమిన్ సి అందుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పటిష్టం చేయడంలో సహాయ పడుతుంది.

డిటాక్స్ వాటర్ గురించి ప్రచారంలో ఉన్న అపోహలు:
డిటాక్స్ వాటర్ గురించి మనందరం నమ్మే కొన్ని విషయాలు శాస్త్రీయంగా నిరూపించబడలేదు.

అపోహ 1: ఇది విషతుల్యాలను బయటకు పంపుతుంది.

నిజం: మన శరీరంలో కాలేయం ,కిడ్నీలు సహజంగానే వ్యర్థాలను బయటకు పంపుతాయి. డిటాక్స్ వాటర్ వాటి పనిని వేగవంతం చేస్తుందనడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవు.

అపోహ 2: ఇది రాత్రికి రాత్రే బరువు తగ్గిస్తుంది.

నిజం: కేవలం డిటాక్స్ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గరు. అయితే.. చక్కెరతో కూడిన సోడాలు, కూల్ డ్రింక్స్‌కు బదులుగా దీనిని తాగడం వల్ల క్యాలరీలు తగ్గి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

అపోహ 3: ఇది pH స్థాయిని సమతుల్యం చేస్తుంది.

నిజం: మనం తాగే డ్రింక్స్ రక్తంలోని pH స్థాయిని మార్చలేవు. మన శరీరం ఆ సమతుల్యతను అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటుంది.

తయారీ విధానం: పండ్లను ముక్కలుగా కోసి ఒక గాజు సీసా నీటిలో వేయాలి. ఒక 2-3 గంటల పాటు అలాగే ఉంచితే ఆ పండ్లలోని సారం నీటిలోకి చేరుతుంది.

డిటాక్స్ వాటర్ అనేది ఏదో ఒక అద్భుత ఔషధం కాదు.. కానీ ఇది మంచినీరు తాగే అలవాటును పెంపొందించే ఒక ఆరోగ్యకరమైన మార్గం. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అంతే కాకుండా జంక్ డ్రింక్స్‌కు దూరంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో పాటు డిటాక్స్ వాటర్ తీసుకుంటే.. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×