E-Paper
Advertisement

రాహా పెంపకంపై ఆలియా ఆందోళన.. సద్గురు రియాక్షన్?

రాహా పెంపకంపై ఆలియా ఆందోళన.. సద్గురు రియాక్షన్?
Advertisement

Alia Bhatt: ప్రముఖ బాలీవుడ్ నాచురల్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సహజత్వంతో.. అందంతో నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. సింపుల్ గా కనిపిస్తూనే.. విపరీతమైన ఆదరణను సొంతం చేసుకుంది.బాలీవుడ్ అగ్రగామి మహేష్ భట్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. తండ్రి ప్రోత్సాహం కొంత ఉపయోగించుకున్నా.. ఆ తర్వాత సొంతంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. అంతేకాదు బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటీమణిగా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఇకపోతే తన కెరియర్ లో ఎన్నో విజయాలు చూసింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఇప్పుడు అయోమయానికి గురవుతోంది ఈ ముద్దుగుమ్మ దీనికి కారణం తన కూతురు రాహా. విషయంలో తాను ఆందోళన చెందుతున్నట్లు తన మనసులోని భావాలను సద్గురు ముందు ఉంచగా.. ఆయన ఊహించని సమాధానం ఇచ్చారు. మరి రాహా పెంపకం విషయంలో సద్గురు ఇచ్చిన సలహా ఏంటో ఇప్పుడు చూద్దాం.

మాతృత్వంలో ఆలియా ఆందోళన..

Advertisement

2022 నవంబర్ 6వ తేదీన మాతృత్వంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె చదువుతున్న పిల్లల పెంపకానికి సంబంధించిన పుస్తకాలను ఇంస్టాగ్రామ్ వేదికగా తరచూ పంచుకుంటూ పిల్లలను ఎలా పెంచాలో పుస్తకాల ద్వారా తెలుసుకుంటోంది అంటూ అభిమానులు కూడా గతంలో కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్ (సద్గురు) తో సంభాషణలో పాల్గొనింది. ఈ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న సమస్య పిల్లల పెంపకంపై సలహా ఇవ్వమని కోరింది. అయితే సద్గురు ఇచ్చిన సలహా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీసింది.

మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే ఏం చేయాలి?

అసలు విషయంలోకి వెళ్తే.. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చెన్నై ప్లస్ ఆధ్వర్యంలో ఇన్ కన్సర్వేషన్ విత్ మిస్టేక్ అనే థీమ్ తో నిర్వహించిన.. ఈ కార్యక్రమానికి హాజరైన ఆలియా భట్.. సద్గురుతో ఒక వ్యక్తి ఎంత సమయం నిద్రపోవాలి అనే అంశాన్ని మొదలుకొని పిల్లల పెంపకం, ట్రోల్స్, వైఫల్యం పట్ల భయం ఇలా అన్ని విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామో లేదో అని ఆందోళన చెందుతున్న మాలాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? అని ఆలియా భట్ సద్గురును అడిగింది.

Advertisement

also read:చెల్లి ఆశా భోస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్.. ఇద్దరి మధ్య విభేదాలకి కారణం?

ఆలియా ప్రశ్నకు సద్గురు సమాధానం..

దీనికి సద్గురు మాట్లాడుతూ..” ఆందోళన చెందే తల్లిదండ్రులు ఎప్పటికీ మంచి తల్లిదండ్రులు కారు. ఆందోళన చెందే తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం కలగదు. పైగా అంతగా ఆందోళన చెందడం ద్వారా తమకు తామే హాని కూడా చేసుకుంటారు” అంటూ సద్గురు ఆలియా కి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆలియా తన కూతురు రాహా కి ఏం నేర్పించాలి అనే అంశంపై తాను మదనపడుతున్నాను అనే విషయాన్ని సద్గురు ముందు ఉంచగా.. ఆయన మాట్లాడుతూ..” పిల్లలకి సంతోషంగా ఉండడం సహజంగానే వస్తుంది. వారికి మీరు నేర్పించేది ఏముంటుంది? మీ కుమార్తె రాహాకు కష్టపడి ఏదేదో నేర్పించే బదులు.. సంతోషంగా ఎలా జీవించాలో రాహా నుంచి నేర్చుకోండి”అంటూ ఆలియా భట్ కు ఎదురు సలహా ఇచ్చారు. అనవసరమైన హడావిడి లేని తల్లిగా ఉండమని, జీవితంలో ఆనందాలను ఎలా ఆస్వాదించాలో తన కుమార్తె నుంచి నేర్చుకోమని కూడా సూచించారు. మొత్తానికైతే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

Related News

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×