Telangana Debt: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారం చేపట్టిందని, ఆ తర్వాత వాళ్ల పరిపాలన కాలంలో ఏకంగా 8 లక్షల కోట్లు అప్పులు పాలు చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసింది ఇదేనంటూ మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కాంగ్రెస్ హయాంలో కట్టారన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ హయంలోనే వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంటుందన్నారు.
పదేళ్లలో ఫామ్ హౌజ్ వదిలి ఢిల్లీకి వెళ్లి ఒక్క కేంద్ర మంత్రిని కూడా కలవలేదని ఎంపీ మండిపడ్డారు. నిజాం నవాబుల్లా పాలించారన్నారు. దోచుకుందాం, దాచుకుందాం. ఓట్లు కొనుక్కుందాం.. అనికేసీఆర్ ఫ్యామిలీ అనుకుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగం సంస్థలు కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగర్,శ్రీరాం సాగర్ కడితే చెక్కు చెదరలేదన్నారు. కేసీఆర్ విశ్వేశ్వరయ్య అనుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కూలిందని విమర్శించారు. కేటీఆర్ చదువుకున్నాడా లేక అమెరికా నుంచి దొంగ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడా? అని ప్రశ్నించారు. 2 కోట్ల 75 లక్షల ఎకరాల్లో కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో ఉందని కేటీఆర్ అబద్దాలు చెప్పారన్నారు.
Also Read: ప్రపంచంలో అతిపెద్ద హోటల్.. అమ్మో, అన్ని వేల రూమ్స్ ఉన్నాయా?
మూసీ రివర్ బోర్డుకు కేటీఆర్ ఎప్పుడూ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీపీఆర్ రెడీ చేసి మూసీ పనులు మొదలు పెట్టామన్నారు. కేటీఆర్ మైండ్ దొబ్బి కాంగ్రెస్ 50 ఏళ్ళు అధికారంలోకి రాదని జోస్యం చెప్తున్నాడన్నారు. అధికారం కోల్పోయామని కేటీఆర్కు ఇప్పటికీ నిద్ర పట్టడం లేదన్నారు. అభివృద్ధి గురించి మోడీని రేవంత్ రెడ్డి ఎన్ని సార్లైనా కలుస్తారని, ఇందులో ఎలాంటి తప్పులేదన్నారు. ప్రజల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరానికి కృష్ణా నదీ జలాలు తెచ్చింది కాంగ్రెస్ అని, త్రాగునీటి కష్టాలు తీర్చింది కూడా కాంగ్రెస్సేనని వివరించారు. బీఆర్ఎస్ హయంలో అందరికి ఫామ్ హౌజ్‌లు వచ్చాయన్నారు.
Also Read: సొంత పార్టీ నేతలపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీలొకి భారీ వలసలంటూ..!