E-Paper
Advertisement

Allari Naresh: షూటింగ్ లో దెబ్బలు తగిలితే సినిమా హిట్..ఇదేం సెంటిమెంట్ రా బాబు!

Allari Naresh: షూటింగ్ లో దెబ్బలు తగిలితే సినిమా హిట్..ఇదేం సెంటిమెంట్ రా బాబు!
Advertisement

Allari Naresh: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ఎన్నో విషయాలలో కొన్ని సెంటిమెంట్లను నమ్ముతుంటారు. వారి సినిమా టైటిల్ నుంచి మొదలుకొని సినిమా విడుదల తేదీలు వరకు కూడా సెంటిమెంట్ తేదీలలోనే విడుదల చేయాలని భావిస్తుంటారు. ఇలా సెంటిమెంట్లను నమ్మే వారి సంఖ్య ఇండస్ట్రీలో ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇకపోతే తాజాగా నటుడు అల్లరి నరేష్(Allari Naresh) సైతం తన సినిమాల సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అల్లరి నరేష్ త్వరలోనే 12A రైల్వే కాలనీ(12ARailway Colony) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ప్రమాదం జరిగితే సినిమా హిట్..

ఈ సినిమా నవంబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లరి నరేష్ తన సినిమాల హిట్ సెంటిమెంటు గురించి మాట్లాడారు. తాను సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురి అయ్యాను అంటే కచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందని నమ్మకం నాకుందని తెలిపారు. ఇప్పుడు 12A రైల్వే కాలనీ సినిమా షూటింగ్ సమయంలో కూడా దెబ్బ తగిలిందని ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

12 A రైల్వే కాలనీ..

Advertisement

ఇదివరకు నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేష్ నటించిన నా సామి రంగ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సమయంలో కూడా తాను ఒక ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో గాయపడ్డానని కట్ చేస్తే సినిమా మంచి సక్సెస్ అందుకుందని తెలిపారు. ఇక ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఈయన ఈ సందర్భంగా తెలియచేయడంతో ఈ వ్యాఖ్యలపై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. గాయాలు తగిలితే సినిమాలు హిట్ కావు.. మంచి కంటెంట్ ఉంటేనే హిట్ అవుతాయి అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం ఈ హిట్ సెంటిమెంట్ ఏంటి రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..

Advertisement

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాకు నాని కాసర్ల గడ్డ దర్శకత్వం వహించగా, అల్లరి నరేష్ కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో సాయికుమార్ జీవన్ కుమార్ వంటి తదితరులు కూడా కీలక పాత్రలలో నటించారు.. ఈ సినిమాకు పొలిమేర సినిమాల దర్శకుడు అనిల్ విశ్వనాథ్ స్క్రీన్ ప్లే అందించగా శ్రీనివాస చిట్టూరి ఈ  నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా కామెడీ హర్రర్ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇదివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది. మరి ఈ సినిమా ద్వారా అల్లరి నరేష్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారు? సినిమాల విషయంలో ఆయన హిట్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Rajinikanth : నటన నేర్పిన గురువు మృతి.. నివాళులు అర్పించిన రజనీకాంత్!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×