E-Paper
Advertisement

Maoist Hidma: హిడ్మా ఆచూకీ ఎలా తెలిసింది? ఆ డైరీ వల్లే దొరికిపోయారా?

Maoist Hidma: హిడ్మా ఆచూకీ ఎలా తెలిసింది? ఆ డైరీ వల్లే దొరికిపోయారా?
Advertisement

Maoist Hidma: కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పెనమాలూరులో భారీగా మావోయిస్టులను గ్రే హౌండ్స్ దళాలు అరెస్ట్ చేశాయి. ఓ బిల్డింగ్‌లో తల దాచుకున్న 27 మంది మావోలను అదుపులోకి తీసుకున్నారు. కూలీలమని చెప్పి మావోయిస్టులు బిల్డింగ్ అద్డెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా బిల్డింగ్ మెుత్తాన్ని ఖాళీ చేయించారు. అనంతరం మావోయిస్టులను చుట్టుముట్టి 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. హిడ్మా డైరీ ఆధారంగా 27 మంది మావోలను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మావోయిస్టు టాప్ క్యాడర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మా డైరీ ఆధారంగా మావోయిస్టులను గుర్తించినట్లు సమాచారం. మరో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పారి తిరుపతి లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

విజయవాడలో కలకలం

Advertisement

విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరులోని ఓ భవనంలో మావోయిస్టుల షెల్టర్ తీసుకున్నట్లు గ్రే హౌండ్స్ భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో భారీగా బలగాలు భవనాన్ని చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్ లో నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు సుశీల కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. మరో ఆరుగురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వీరి కోసం ఏపీ గ్రేహౌండ్స్ సెర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టింది.

హిడ్మా, అతడి భార్య హతం

అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ లో ఆరుగురు మావోలు చనిపోయారని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియాకు తెలిపారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు ఆంధ్ర-తెలంగాణ అటవీ ప్రాంతాల్లోకి వచ్చినట్లు సమాచారం అందిందన్నారు. దీంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించామని తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, అతడి భార్య హతమయ్యారని పేర్కొన్నారు. మావోయిస్టుల మృతదేహాలను రికవరీ చేశామన్నారు.

Advertisement

ఆపరేషన్ కగార్ లో భాగంగా కేంద్రం మావోయిస్టులకు అల్టిమేటం జారీ చేసింది. కర్రెగుట్టతో పాటు మావోయిస్టుల కీలక స్థావరాలను జల్లెడ పడుతోంది. వందల సంఖ్యలో మావోలు లొంగిపోతున్నారు. కర్రెగుట్టలో 25 వేల భద్రతా బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. గతంలో పోలీసులు నుంచి తప్పించుకున్న హిడ్మా.. మారేడుమిల్లి ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందడంతో భారీగా కూంబింగ్ చేపట్టారు.

ఆరుగురు మావోలు మృతి

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారని ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. మంగళవారం ఉదయం 6.30 నుంచి 7.00 గంటల మధ్య భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయన్నారు. గత రెండు రోజులుగా ఇంటెలిజెన్స్‌ సమాచారంతో మావోల కోసం గాలింపు చర్యలను చేపట్టామని మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. మావోల నుంచి వివిధ రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని పేర్కొన్నారు.

కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు ఏడీజీ మహేశ్‌ చంద్ర లడ్డా పేర్కొన్నారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారన్నారు.

మావోల వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు

  • ఏకే-47 – 2
  • పిస్టల్‌ -1
  • రివాల్వర్‌ -1
  • సింగిల్‌ బోర్‌ ఆయుధం -1
  • ఎలక్ట్రికల్ డిటోనేటర్లు -1525
  • నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు -150
  • ఎలక్ట్రికల్ వైర్ బండిల్ -1
  • కెమెరా ఫ్లాష్ లైట్ -1
  • కటింగ్‌ బ్లేడ్ -1
  • ఫ్యూజ్ వైర్ -25 మీటర్లు
  • కిట్ బ్యాగులు -7

Also Read: Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×